Swetha
పెద్ద పెద్ద సినిమాలకు ఓటిటి డీల్స్ చాలా ఈజీగా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో ఈ బిజినెస్ కాస్త డల్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే డీల్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఆ సినిమాలు థియేటర్లో ఊహించని షాక్ ను ఇస్తున్నాయి. సో ఓటిటి లు కూడా జాగ్రత్త పడుతున్నాయి.
పెద్ద పెద్ద సినిమాలకు ఓటిటి డీల్స్ చాలా ఈజీగా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో ఈ బిజినెస్ కాస్త డల్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే డీల్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఆ సినిమాలు థియేటర్లో ఊహించని షాక్ ను ఇస్తున్నాయి. సో ఓటిటి లు కూడా జాగ్రత్త పడుతున్నాయి.
Swetha
పెద్ద పెద్ద సినిమాలకు ఓటిటి డీల్స్ చాలా ఈజీగా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో ఈ బిజినెస్ కాస్త డల్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే డీల్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఆ సినిమాలు థియేటర్లో ఊహించని షాక్ ను ఇస్తున్నాయి. సో ఓటిటి లు కూడా జాగ్రత్త పడుతున్నాయి. చిన్న సినిమాలైతే పూర్తిగా ఆశలు వదిలేసుకున్నాయి. సినిమాలు బావుంటే అమ్ముడుపోవడం.. లేదంటే లేదు. అయితే స్టార్ హీరోల సినిమాలు ఈజీగా అమ్ముడుపోతాయి. కానీ ఇక్కడ రాజాసాబ్ మూవీ ఓటిటి డీల్ మాత్రం ఇంకా క్లోజ్ అవ్వలేదు. దానికి కారణం లేకపోలేదు.
నిజానికి రాజాసాబ్ నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ అటూ ఇటుగా రూ.200 కోట్లు పలుకుతున్నాయట. అయితే ఈ సినిమాకు సంబంధించి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ముంబైకు చెందిన ఓ కంపెనీ దగ్గర ఫైనాన్స్ తీసుకొందట. ఆ కంపెనీతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇప్పుడు మంచి సంబంధాలు లేవట. సో ప్రస్తుతం వీరి మధ్య ఓ కేసు నడుస్తుంది. వడ్డీలతో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి తీసుకున్న మొత్తం అమౌంట్ సుమారు రూ.300 కోట్లు.
అవన్నీ క్లియర్ చేస్తే కానీ, ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వదట. దానికి సంబంధించి సంప్రదింపులు కూడా జరుగుతున్నాయట. జనవరి 9న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అలాగే నవంబర్ 5 న మూవీ నుంచి ఫస్ట్ గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేయనున్నారు. సో ఈ నవంబర్ కు ఓటిటి డీల్ ను కూడా క్లోజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.