Swetha
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల గురించి తెలియనిది కాదు. రాజాసాబ్ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఇది కాకుండా రీసెంట్ గా హనురాఘవాపుడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ గురించి అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుంది.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల గురించి తెలియనిది కాదు. రాజాసాబ్ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఇది కాకుండా రీసెంట్ గా హనురాఘవాపుడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ గురించి అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ చిన్నప్పటి క్యారెక్టర్ లో ఓ ప్రముఖ తెలుగు హీరో కొడుకు కనిపించబోతున్నాడట.
అతను మరెవరో కాదు మహేష్ మేనల్లుడు , సుధీర్ బాబు కుమారుడు దర్శన్. ఫౌజీలో ప్రభాస్ చిన్నప్పటి పాత్రలో అతను కనపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. అలాగే గూఢచారి-2లో కూడా దర్శన్ ఓ ఇంపార్టెంట్ రోల్ లో నటించబోతున్నలు టాక్ ఉంది. దీని గురించి అటు సుధీర్ బాబు నుంచి కానీ మూవీ టీం నుంచి కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దీని గురించి త్వరలోనే ఏదైనా అప్డేట్ ఇస్తారేమో చూడాలి.
ఆల్రెడీ సుధీర్ బాబు పెద్ద కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేసాడు. సుధీర్ బాబు నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’లో కూడా ఓ చిన్న పాత్రలో ఆయన పెద్ద కొడుకు చరిత్ నటించాడు. భలే మగాడివోయ్ సినిమాలో జూనియర్ నానిగా కనిపించింది కూడా ఇతనే. ఇక ఇప్పుడు రెండో కొడుకు దర్శన్ కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.