Swetha
సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ తర్వాత ఇండస్ట్రీలో ఆ లెగసిని కంటిన్యూ చేస్తున్నాడు మహేష్ బాబు. మహేష్ కొడుకు గౌతమ్ ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇక కూతురు సితారా సోషల్ మీడియా ద్వారా అందరికి దగ్గరయింది. వీరిద్దరూ సినిమాలలోకి రావాలనేది అభిమానుల కోరిక.

సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ తర్వాత ఇండస్ట్రీలో ఆ లెగసిని కంటిన్యూ చేస్తున్నాడు మహేష్ బాబు. మహేష్ కొడుకు గౌతమ్ ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇక కూతురు సితారా సోషల్ మీడియా ద్వారా అందరికి దగ్గరయింది. వీరిద్దరూ సినిమాలలోకి రావాలనేది అభిమానుల కోరిక. అలాగే రమేష్ తనయుడు ఇప్పుడు ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఇక ఇప్పుడు ఘట్టమనేని వారి నుంచి హీరోయిన్ గా తన లక్ ను టెస్ట్ చేసుకోడానికి వస్తుంది జాన్వీ స్వరూప్.
తనెరో కాదు.. కృష్ణ మనవరాలు.., మంజుల కుమార్తె.. మహేష్ బాబు మేనకోడలు. అప్పట్లో మంజుల కూడా కొన్ని సినిమాలలో కనిపించి అలరించారు. ఓ సినిమాలో హీరోయిన్ గా తన పేరు అనౌన్స్ చేశారు. కానీ కొన్ని కారణాల వలన అది జరగలేదు. ఆ తరవాత ఘట్టమనేని మంజుల నిర్మాతగా కొన్ని సినిమాలు చేశారు. ఓ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. ఇప్పుడు పూర్తిగా సినిమాలకు దూరం అయ్యారు. కానీ తన కుమార్తెనే ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. నటన, డాన్సింగ్ కి సంబంధించిన ట్రైనింగ్ మొత్తం జాన్వీ కి ఇప్పించారట. త్వరలోనే తెరంగేట్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబందించిన అఫీషియల్ అనౌన్సుమెంట్ ను త్వరలోనే ఇవ్వనున్నారు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.