iDreamPost
android-app
ios-app

ప్రశాంత్ వర్మ ‘మహంకాళి’ సినిమా ఫస్ట్ లుక్

  • Published Oct 30, 2025 | 2:06 PM Updated Updated Oct 30, 2025 | 2:06 PM

ప్రశాంత్ వర్మ నుంచి సినిమా వచ్చి చాలా కాలం దాటిపోతుంది. కానీ అతని చేతిలో ఉన్న సినిమాలు మాత్రం చాలానే ఉన్నాయని అడపా దడపా టాక్స్ వినిపిస్తున్నాయి. కానీ ఆ ప్రాజెక్ట్స్ ఒక్కటి కూడా కార్యరూపం దాల్చడం లేదని టాక్స్ వినిపిస్తున్నాయి. ఈలోపే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మహంకాళి పోస్టర్ ను రివీల్ చేశారు.

  • Published Oct 30, 2025 | 2:06 PMUpdated Oct 30, 2025 | 2:06 PM
ప్రశాంత్ వర్మ ‘మహంకాళి’ సినిమా ఫస్ట్ లుక్

ప్రశాంత్ వర్మ నుంచి సినిమా వచ్చి చాలా కాలం దాటిపోతుంది. కానీ అతని చేతిలో ఉన్న సినిమాలు మాత్రం చాలానే ఉన్నాయని అడపా దడపా టాక్స్ వినిపిస్తున్నాయి. కానీ ఆ ప్రాజెక్ట్స్ ఒక్కటి కూడా కార్యరూపం దాల్చడం లేదని టాక్స్ వినిపిస్తున్నాయి. ఈలోపే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మహంకాళి పోస్టర్ ను రివీల్ చేశారు. ఈ సినిమా ఫిమేల్ సూపర్ హీరో మూవీగా రానుంది. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ కథ మాత్రమే అందిస్తున్నారు. దీనిని పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా అంతా కూడా బెంగాల్ బ్యాక్డ్రాప్ లో సాగే కథలా ఉంటుందంట. పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో శుక్రాచార్యుడిగా అక్షయ్‌ ఖన్నా నటించబోతున్నాడు. కన్నడకు చెందిన భూమి శెట్టి టైటిల్ రోల్ పోషిస్తుంది. ఆమెకు తెలుగులో ఇది రెండో సినిమా. కింగ్డమ్‌లో సత్యదేవ్‌ సతీమణి గౌరి పాత్రలో ఈమె నటించింది. అలాగే సోషల్ మీడియాలోను ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.