Swetha
ఇప్పుడు యానిమేషన్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. అందులోను డివోషనల్ కంటెంట్ , పురాణ ఇతిహాసాలను ఇప్పటి జెనెరేషన్ కు నచ్చేలా చాలా యూనిక్ వే లో చూపిస్తున్నారు. దానికి క్లియర్ ఎగ్జామ్పుల్ ఈ మధ్య కాలంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన మహావతారా నరసింహ.
ఇప్పుడు యానిమేషన్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. అందులోను డివోషనల్ కంటెంట్ , పురాణ ఇతిహాసాలను ఇప్పటి జెనెరేషన్ కు నచ్చేలా చాలా యూనిక్ వే లో చూపిస్తున్నారు. దానికి క్లియర్ ఎగ్జామ్పుల్ ఈ మధ్య కాలంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన మహావతారా నరసింహ.
Swetha
ఇప్పుడు యానిమేషన్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. అందులోను డివోషనల్ కంటెంట్ , పురాణ ఇతిహాసాలను ఇప్పటి జెనెరేషన్ కు నచ్చేలా చాలా యూనిక్ వే లో చూపిస్తున్నారు. దానికి క్లియర్ ఎగ్జామ్పుల్ ఈ మధ్య కాలంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన మహావతారా నరసింహ. ఈ సినిమా వచ్చిన తర్వాత ఓటిటిలో కూడా ఇలాంటి యానిమేషన్ సినిమాలు సిరీస్ లు చాలానే వచ్చాయి . ఇక త్వరలో హనుమంతుడు గురించి ‘వాయుపుత్ర’ అనే సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో చందు మొండేటి రూపొందిస్తున్నాడు. అయితే దీని గురించి నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ‘‘ప్రపంచంలోనే ఆంజనేయ స్వామి అంత బలవంతుడు ఇంకొకరు లేరంటారు కదా. అలాంటి బలవంతుడిని మాస్ హీరోగా చూపిస్తే ఎలా ఉంటుందో అలా కమర్షియల్ సినిమాల స్టయిల్లో చూపించబోతున్నాం. మీకు ప్రభాస్‌ను సలార్‌లో చూస్తే ఒక మాస్ హై ఎలా వస్తుందో.. అలా ఆంజనేయ స్వామిని చూస్తే హై వచ్చేలా చందు అన్ని సీక్వెన్సెస్ డిజైన్ చేశాడు. సంక్రాంతికి ఒక టీజర్ ట్రై చేస్తున్నాం. ఆ టీజర్ చూసినపుడే మీకు ఒక ఐడియా వస్తుంది. ఒక మాస్ హీరోను చూసినట్లు ఫీలవుతారు ఆంజనేయస్వామిని చూస్తే. అలా కొత్తరకంగా యానిమేషన్ ట్రై చేస్తున్నాం’’
అని చెప్పుకొచ్చారు నాగవంశీ. సో చూడబోతుంటే వాయుపుత్ర మూవీ ప్రేక్షకులకు సూపర్ హై ఇవ్వబోతుందని తెలుస్తుంది. ఇది ఎలా ఉండబోతుంది అనేది సంక్రాంతికి తెలిసిపోతుంది. ఇక ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.