Swetha
ప్రతి వారం ఓటిటిలో పదుల సంఖ్యలో సినిమాలు , సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఈ వారం కూడా ఇరవైకి పైగానే సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. వాటిలో ఏమి చూడాలి అనే కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటుంది. అయితే ఈ వారం స్ట్రీమింగ్ కాబోయే సినిమాలలో మాత్రం ఈ ఆరు సినిమాలను అసలు మిస్ కాకుండ చూసేయండి.

1. లోకా ఛాప్టర్ 1 చంద్ర :
కల్యాణి ప్రియదర్శన్ నటించిన మలయాళ మూవీ లోకా ఛాప్టర్ 1 చంద్ర. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. మళయాళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి టాక్ సంపాదించుకుంది. ఇప్పుడు ఈ మూవీ తెలుగు తమిళం కన్నడ హిందీ భాషల్లో అక్టోబర్ 31 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
2. కాంతార: ఏ లెజెండ్ ఛాప్టర్ 1
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటించిన మూవీ కాంతార ఛాప్టర్ 1. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళంలలో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటిటి లో స్ట్రీమింగ్ కానుంది. . హిందీ వెర్షన్ మరో నెల రోజుల తర్వాత వస్తుందట. ఓటిటి స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసినా కానీ ఇంకా థియేటర్స్ లో జోరు కొనసాగిస్తూనే ఉంది.
3. మారిగళ్లు వెబ్ సిరీస్
కన్నడ నుండి వచ్చిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఈ మారిగళ్లు. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాను అసలు మిస్ కాకుండా చూడాల్సిందే. సాధారణ హత్య లేదా తప్పిపోయిన వ్యక్తుల విచారణలా కాకుండా..కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఇది మొత్తం 7 ఎపిసోడ్స్ లో ఉంటుంది. ఇందులో దివంగత పునీత్ రాజ్ కుమార్ ఏఐ వెర్షన్ స్పెషల్ అట్రాక్షన్ . అక్టోబర్ 31 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
4. ఇడ్లీ కడై
తమిళ స్టార్ ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ఇది. తెలుగులో ఇడ్లీ కొట్టుగా వచ్చింది. థియేటర్ లో యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నా ఈ సినిమా ఓటిటి లో ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో చూడాలి .ఈ సినిమా ఆల్రెడీ నెట్‌ఫ్లిక్స్ లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
5. తలవర
ఇది ఒక మలయాళం మూవీ. ఇది కూడా అక్టోబర్ 29 నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.మలయాళ సినిమాలు ప్రేక్షకులను ఎప్పుడు మెస్మరైజ్ చేస్తూనే ఉంటాయి. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి.
6. మధురం జీవామృత బిందు
మలయాళ దర్శకుడు, నటుడు బేసిల్ జోసెఫ్ నటించిన ఈ సినిమాలో.. సుహాసిని మణిరత్నం, లాల్ వంటి నటులతోపాటు సైజు కురుప్, వినయ్ ఫోర్ట్ వంటి వాళ్లు కూడా ఉన్నారు. ఈ సినిమా సైనా ప్లేలోకి రానుంది.
కాబట్టి ఈ సినిమాలను అసలు మిస్ చేయకుండా చూసేయండి. వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు ఈ లిస్ట్ లో యాడ్ అవ్వొచ్చు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి .