Swetha
కొంతమంది హీరోల నుంచి సినిమాలు వస్తే వెంట వెంటనే వస్తాయి. లేదంటే అసలు సినిమాలే రావు. అల్లరినరేష్ విషయంలో జరుగుతుంది కూడా అదే. గత ఏడాది అల్లరినరేష్ నుంచి మూడు సినిమాలు వచ్చాయి. రెండు సినిమాలలో హీరోగా నటించాడు.. మరొకటి నాగార్జునతో కాంబినేషన్ లో నటించాడు. కానీ మూడు సినిమాలు కూడా ఊహించిన రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.

కొంతమంది హీరోల నుంచి సినిమాలు వస్తే వెంట వెంటనే వస్తాయి. లేదంటే అసలు సినిమాలే రావు. అల్లరినరేష్ విషయంలో జరుగుతుంది కూడా అదే. గత ఏడాది అల్లరినరేష్ నుంచి మూడు సినిమాలు వచ్చాయి. రెండు సినిమాలలో హీరోగా నటించాడు.. మరొకటి నాగార్జునతో కాంబినేషన్ లో నటించాడు. కానీ మూడు సినిమాలు కూడా ఊహించిన రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. కామిడి ట్రాక్ నుంచి బయటకు వచ్చి తీసిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో అల్లరి నరేష్ కాస్త డైలమాలో పడ్డాడు. దీనితో ఈ ఏడాది ఇప్పటివరకు ఈ హీరో నుంచి సినిమాలు రాలేదు.
ఇప్పుడు ఒకేసారి నలభై రోజుల గ్యాప్ తో అల్లరినరేష్ నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. వంబర్ ఇరవై ఒకటిన 12 రైల్వే కాలనీతో సస్పెన్స్ అభిమానులను థ్రిల్ చేయడానికి వస్తున్నట్లు నిన్ననే అనౌన్స్ చేసాడు. ఈ సినిమాలో చాలానే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా తర్వాత 2026 కొత్త సంవత్సరం అల్లరి నరేష్ సినిమాతోనే స్టార్ట్ అవ్వబోతుంది. ఆల్కహాల్ అనే సినిమాతో అందరికి కిక్ ఇవ్వడానికి జనవరి 1 న రాబోతున్నాడు.
సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణం కావడంతో కంటెంట్ స్ట్రాంగ్ గానే ఉందని ఇన్సైడ్ టాక్. సంక్రాంతికి హెవీ కాంపిటీషన్ ఉంది కాబట్టి పది రోజుల ముందే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ రెండు సక్సెస్ అవ్వడం ఇప్పుడు అల్లరి నరేష్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటికి అల్లరి నరేష్ కామిడికి ఫ్యాన్ బేస్ అలానే ఉన్నారు. సో ఈ రెండు సినిమాలు ఈ హీరో కంబ్యాక్ ను డిసైడ్ చేస్తాయో లేదో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.