Swetha
ప్రభాస్ చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయో అందరికి తెలిసిందే. రీసెంట్ గా ప్రభాస్ బర్త్ డే నుంచి దాదాపు అతని కొత్త సినిమాలన్నిటి నుంచి ఎదో ఒక అప్డేట్ వచ్చింది. వచ్చే ఐదేళ్లల్లో ఏడాదికి ఓ సినిమా రిలీజ్ అవ్వడం కన్ఫర్మ్. ప్రస్తుతం ది రాజాసాబ్ రిలీజ్ కు రెడీ అవుతుండగా.. ఫౌజీ సెట్స్ మీద ఉంది. ఈ రెండు కాకుండా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ రానున్న సంగతి తెలిసిందే

ప్రభాస్ చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయో అందరికి తెలిసిందే. రీసెంట్ గా ప్రభాస్ బర్త్ డే నుంచి దాదాపు అతని కొత్త సినిమాలన్నిటి నుంచి ఎదో ఒక అప్డేట్ వచ్చింది. వచ్చే ఐదేళ్లల్లో ఏడాదికి ఓ సినిమా రిలీజ్ అవ్వడం కన్ఫర్మ్. ప్రస్తుతం ది రాజాసాబ్ రిలీజ్ కు రెడీ అవుతుండగా.. ఫౌజీ సెట్స్ మీద ఉంది. ఈ రెండు కాకుండా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఆడియో గ్లింప్స్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేసింది. అయితే ఈ అప్డేట్ రాకముందు నుంచే ఈ సినిమాలో కొరియన్ హీరో డాన్ లీ విలన్ గా నటిస్తున్నాడు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటివరకు దీనిని అఫీషియల్ గా ఎవరు అనౌన్స్ చేయలేదు. పైగా మొన్నీమధ్యన వచ్చిన ఆడియోలో కూడా డాన్ లీ క్యారెక్టర్ ఉన్నట్టు రివీల్ చేయలేదు. సో డాన్ లీ ఈ మూవీలో ఉండకపోవచ్చని అంతా అనుకున్నారు.
కానీ ఇప్పుడు డాన్ లీ సినిమాలో ఉన్నట్టు కన్ఫర్మ్ చేశారు కొరియన్ మీడియా . “స్పిరిట్ అనే చిత్రంలో డాన్ లీ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. బాహుబలి సినిమాతో ఫేమస్ అయిన ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో డాన్ లీ నెగిటివ్ పాత్రలో కనిపిస్తున్నాడని వినికిడి” అంటూ రాసుకొచ్చారు. సో స్పిరిట్ లో డాన్ లీ కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. ఇక్కడ అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.