Swetha
అడవిష్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఈ హీరో నుంచి వచ్చే సినిమాలన్నీ కూడా సూపర్ న్యాచురల్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్స్ ఏ. అందుకే అడవిశేష్ నుంచి ఎప్పుడు ఏ సినిమా వచ్చినా దానికి క్రేజ్ బాగానే ఉంటుంది. ఇక ఈ ఏడాది చివర్లో డెకాయిట్ అనే మూవీతో రాబోతున్నట్లు అప్పట్లో బాగా హడావిడి చేసారు. కానీ అనేక కారణాల వలన అది కాసంత పోస్ట్ పోన్ అయింది.

అడవిష్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఈ హీరో నుంచి వచ్చే సినిమాలన్నీ కూడా సూపర్ న్యాచురల్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్స్ ఏ. అందుకే అడవిశేష్ నుంచి ఎప్పుడు ఏ సినిమా వచ్చినా దానికి క్రేజ్ బాగానే ఉంటుంది. ఇక ఈ ఏడాది చివర్లో డెకాయిట్ అనే మూవీతో రాబోతున్నట్లు అప్పట్లో బాగా హడావిడి చేసారు. కానీ అనేక కారణాల వలన అది కాసంత పోస్ట్ పోన్ అయింది. సినిమాలో హీరోయిన్ మారడం.. శృతిహాసన్ ప్లేస్ లో మృణాల్ రావడం.. తనకు సంబందించిన సీన్స్ రీషూట్ చేయడం.. హీరోకు యాక్సిడెంట్ అవ్వడం ఇలా చాలానే ఇన్సిడెంట్స్ ఈ సినిమాకు అడ్డుపడుతున్నాయి.
ఇన్ని అడ్డంకులను తట్టుకుని షూట్ ను అయితే కొనసాగిస్తున్నారు టీం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉన్నారట టీం. ఈ క్రమంలో ఇప్పుడు మూవీ న్యూ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు నిర్మాత. ఈ సినిమాను 2026 మార్చ్ 19 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారట. ఈసారి ఎలాంటి పోస్ట్ పోన్ ఉండదు. ఇదంతా బాగానే ఉంది కానీ.. వెళ్లి వెళ్లి డెకాయిట్ పెద్ద సినిమాలతోనే పెట్టుకుంటుందేమో అనిపిస్తుందని కొందరు అంటున్నారు.
ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయినా వారానికి అంటే మార్చి 26, 27 తేదీల్లో రామ్ చరణ్ పెద్ది , నాని ప్యారడైజ్ సినిమాలు రానున్నాయి. వీటికి కాంపిటీషన్ గా రావడం అనేది కాస్త రిస్క్ చేస్తున్నట్లే. డెకాయిట్ ఇంత కాన్ఫిడెంట్ గా ఆ డేట్ ను అనౌన్స్ చేసిందంటే .. ఆ రెండు సినిమాలలో ఏదైనా పోస్ట్ పోన్ అయినా అవ్వొచ్చు. రెండేళ్లుగా అడవి శేష్ నుంచి సినిమాలు రాకపోవడంతో ఆడియన్స్ కూడా ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.