Swetha
రెండు రోజుల క్రితం నుంచి సోషల్ మీడియాలో అరుంధతి హిందీ రీమేక్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. దీనిలో శ్రీలీల హీరోయిన్ గా ఉండబోతుందంట. అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తారట. అలాగే మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారట. ఇదంతా బానే ఉంది. కానీ అసలు ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అరుంధతి రీమేక్ విషయం ఎందుకు గుర్తొచ్చింది అనేది అందరి ప్రశ్న

రెండు రోజుల క్రితం నుంచి సోషల్ మీడియాలో అరుంధతి హిందీ రీమేక్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. దీనిలో శ్రీలీల హీరోయిన్ గా ఉండబోతుందంట. అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తారట. అలాగే మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారట. ఇదంతా బానే ఉంది. కానీ అసలు ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అరుంధతి రీమేక్ విషయం ఎందుకు గుర్తొచ్చింది అనేది అందరి ప్రశ్న. టాలీవుడ్ లో బాలీవుడ్ ఇప్పటికే ఈ సినిమాను అందరు చూసేసారు.అయినాసరే సడెన్ గా ఇప్పుడు అరుంధతి రీమేక్ ఎందుకు వచ్చింది అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు.
పైగా అరుంధతి పాత్రలో అనుష్క చేసిన తర్వాత.. ఆ ప్లేస్ లో ఇంకొకరిని ఊహించుకోవడం కూడా కాస్త కష్టంగానే ఉందని సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. శ్రీలీల బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతవరకు అట్రాక్ట్ చేయగలదు అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే అని టాక్. గద్వాల్ రాణిగా అనుష్కలోని హుందాతనం, రాజసం.. ఇంత స్లిమ్ గా ఉన్న శ్రీలీల సెట్ అవుతాయా అంటే కాస్త కష్టమే అని చెప్పాలి. ఏదేమైనా సరే ఇది చేయాల్సిందే అంటే మాత్రం శ్రీలల కు ఇది చాలా పెద్ద బాధ్యత.
సరే శ్రీలీల గురించి పక్కన పెట్టేసి కంటెంట్ విషయానికొస్తే.. బాలీవుడ్ లో తీసిన హిస్టారికల్ ఫిలిమ్స్ , పీరియాడిక్ డ్రామాస్ అక్కడ ఎలాంటి టాక్ సంపాదించుకుంటాయో.. తెలుగులో కూడా అలాంటి టాక్ నే సంపాదించుకుంటాయి. కానీ ఇక్కడ భీభత్సంగా ఆడిన సినిమాలు మాత్రం బాలీవుడ్ కు వెళ్ళేటప్పటికి డీలా పడిపోతూ ఉంటాయి. జెర్సీ, హిట్ ది ఫస్ట్ కేస్ , భాగమతి సినిమాలు దీనికి ఉదాహరణలు. ప్రస్తుతానికైతే ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. అఫీషియల్ అనౌన్సుమెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.