Swetha
OTT Suggestions: ఓటిటి లో ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ వస్తూ ఉంటుంది. కొన్ని థియేటర్ లో రిలీజ్ చేసిన సినిమాలైతే మరికొన్ని డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ అయ్యే సినిమాలు. అయితే ఓటిటి లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలకంటే కూడా సిరీస్ లకు ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. అయితే ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లు రావడం వలన ఆల్రెడీ వచ్చేసిన కొన్ని మంచి సిరీస్ ల ను మిస్ అయిపోతున్నారు ఆడియన్స్. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ సిరీస్ గురించే.

ఓటిటి లో ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ వస్తూ ఉంటుంది. కొన్ని థియేటర్ లో రిలీజ్ చేసిన సినిమాలైతే మరికొన్ని డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ అయ్యే సినిమాలు. అయితే ఓటిటి లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలకంటే కూడా సిరీస్ లకు ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. అందులోను ఆ కంటెంట్ తెలుగులో ఉంటె ఇక అసలు ఆలస్యం చేయకుండా చూస్తూ ఉంటారు. అయితే ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లు రావడం వలన ఆల్రెడీ వచ్చేసిన కొన్ని మంచి సిరీస్ ల ను మిస్ అయిపోతున్నారు ఆడియన్స్. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ సిరీస్ గురించే.
అసలు ఏంటి ఈ సిరీస్ అనే తెలుసుకునే ముందు. ఈ సిరీస్ స్టోరీ లైన్ ఏంటో చూసేద్దాం. ఈ సిరీస్ స్టోరీ లైన్ విషయానికొస్తే.. ఇది ఓ ఓ తమిళ మెడికల్ డ్రామా. దీపా బాలు, అనుమోల్, చారుకేశ్, అమిత్ భార్గవ్, యోగాలక్ష్మి, షర్మిలా థాపాలాంటి వాళ్లు నటించారు. ఇది ఆర్కే హాస్పిటల్, అందులోని డాక్టర్ ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే స్టోరీ. ఇది ఇప్పటికే మొదటి సీజన్ కంప్లీట్ చేసుకుని.. రెండు సీజన్ ఎండింగ్ కి కూడా వచ్చేసింది. తొలి సీజన్లో ఈ ఫ్రెండ్స్ అందరూ ఇంటెర్న్స్ గా ఉంటారు. ఇప్పుడు రెండో సీజన్లో వీళ్లంతా సీనియర్ డాక్టర్లు అయ్యారు. వాళ్ళ లైఫ్స్ లో ఎలాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి అనేదే ఈ సిరీస్ కథ.
తొలి సీజన్ మొత్తం 100 ఎపిసోడ్స్ ఉంటుంది. రెండు సీజన్ ను కూడా అలానే ప్లాన్ చేస్తున్నారు. ఈ సిరీస్ పేరు ‘హార్ట్ బీట్’. ప్రతి గురువారం నాలుగు ఎపిసోడ్స్ ను రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇంకొక వారంలో రెండు సీజన్ కూడా కంప్లీట్ అవుతుంది. ప్రస్తుతం ఈ సిరీస్ కు తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సిరీస్ ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఈ సిరీస్ ను ఎవరైనా మిస్ అయ్యి ఉంటె వెంటనే చూసేయండి. వర్త్ వాచింగ్ అనే ఫీల్ రావడం కన్ఫర్మ్. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.