iDreamPost
android-app
ios-app

ట్రైలర్ తర్వాత మారిన హైప్

  • Published Oct 28, 2025 | 10:27 AM Updated Updated Oct 28, 2025 | 11:21 AM

రవితేజ నుంచి హిట్ బొమ్మ వచ్చి చాలా కాలం అయింది. ఈ మధ్య కాలంలో రవితేజ నుంచి వచ్చిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు రవి తేజ నుంచి రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమా మాస్ జాతర. ఈ సినిమా ఇప్పటికి చాలా సార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది

రవితేజ నుంచి హిట్ బొమ్మ వచ్చి చాలా కాలం అయింది. ఈ మధ్య కాలంలో రవితేజ నుంచి వచ్చిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు రవి తేజ నుంచి రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమా మాస్ జాతర. ఈ సినిమా ఇప్పటికి చాలా సార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది

  • Published Oct 28, 2025 | 10:27 AMUpdated Oct 28, 2025 | 11:21 AM
ట్రైలర్ తర్వాత మారిన హైప్

రవితేజ నుంచి హిట్ బొమ్మ వచ్చి చాలా కాలం అయింది. ఈ మధ్య కాలంలో రవితేజ నుంచి వచ్చిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు రవి తేజ నుంచి రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమా మాస్ జాతర. ఈ సినిమా ఇప్పటికి చాలా సార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. కానీ రీసెంట్ గా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ తర్వాత సినిమా మీద టాక్ అంతా మారిపోయింది. మరింత హైప్ పెరిగింది.

ఈ సినిమాను దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించాడు. పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమాను రూపొందించాడట ఈ దర్శకుడు. అంటే వింటేజ్ రవితేజను ఈ సినిమాలో మరోసారి చూసే ఛాన్స్ ఉంది. రవితేజ నుంచి ఆడియన్స్ ఏమి కోరుకుంటున్నారో అచ్చం అదే మాస్ ను సినిమాలో దింపేసాడు. ట్రైలర్ చూస్తే ఈ విషయం సరిగ్గా అర్థమైపోతుంది. ట్రైలర్ లోని చిన్న బిట్ ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. సో మొత్తానికి ట్రైలర్ సినిమా మీద హైప్ ని పెంచేసినట్టు అయింది. అక్టోబర్ 31 న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఇక ఇది ఎలా ఉండబోతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.