Swetha
ఈ మధ్య కాలంలో వచ్చిన మలయాళ మూవీ కొత్త లోక చాప్టర్ 1. లేడి ఓరియెంటెడ్ కాన్సెప్ట్ లో వచ్చిన ఈ సినిమా.. థియేట్రికల్ ఎండ్ లోపు బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది
ఈ మధ్య కాలంలో వచ్చిన మలయాళ మూవీ కొత్త లోక చాప్టర్ 1. లేడి ఓరియెంటెడ్ కాన్సెప్ట్ లో వచ్చిన ఈ సినిమా.. థియేట్రికల్ ఎండ్ లోపు బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది
Swetha
 
        
ఈ మధ్య కాలంలో వచ్చిన మలయాళ మూవీ కొత్త లోక చాప్టర్ 1. లేడి ఓరియెంటెడ్ కాన్సెప్ట్ లో వచ్చిన ఈ సినిమా.. థియేట్రికల్ ఎండ్ లోపు బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జియో హాట్స్టార్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. కల్యాణి ప్రియదర్శన్ సూపర్ పవర్స్ కలిగిన ఓ లేడి . ఒక మిషన్‌లో ఆమె శత్రువుల నుంచి తప్పించుకుంటుంది. దీంతో మమ్ముట్టి ఆమెను రహస్యంగా ఉండాలంటూ హెచ్చిరిస్తాడు. దీంతో చంద్ర బెంగళూరుకు షిఫ్ట్ అయ్యి సైలెంట్‌గా జీవిస్తుంది. ఆమె పక్కింట్లో ఉండే సన్నీ ఆమెతో స్నేహం పెంచుకుని ఆమెకు దగ్గరవుతాడు. ఈ క్రమంలో ఇన్‌స్పెక్టర్ నాచియప్ప గౌడకి చంద్రపై అనుమానం వస్తుంది. ఇంతకీ అతడికి చంద్రపై అనుమానం ఎందుకు వచ్చింది..? అసలు చంద్ర ఎవరు..? సన్నీ ఎందుకు అంతగా భయపడతాడు.? అనేది ఈ సినిమా కథ.
దర్శకుడు డామినిక్ అరుణ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఇది. ఈ సినిమాకు సిక్వెల్ కూడా ఉంటుందని ఆల్రెడీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. థియేటర్లో ఈ సినిమాను మిస్ అయ్యి ఉంటె. ఎంచక్కా జియో హాట్ స్టార్ లో ఈ సినిమాను చూసేయండి. ఈ వీకెండ్ కు ఇదే బెస్ట్ చాయిస్. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
