Swetha
బాహుబలి మొదటి భాగం వచ్చి పదేళ్లు అయింది. ఈ సినిమా రావడమేమో కానీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది. రాజమౌళి రాజమౌళి ఏమి చేస్తావ్ అని అడిగితే తెలుగు రాని ఎన్ఆర్ఐ ల చేత కూడా విజిల్స్ వేయిస్తాను అన్నాడట. ఇప్పుడు సోషల్ మీడియాలో బాహుబలి ఎపిక్ కు సంబందించిన హడావిడి చూస్తుంటే ఇలానే అనిపిస్తుంది
బాహుబలి మొదటి భాగం వచ్చి పదేళ్లు అయింది. ఈ సినిమా రావడమేమో కానీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది. రాజమౌళి రాజమౌళి ఏమి చేస్తావ్ అని అడిగితే తెలుగు రాని ఎన్ఆర్ఐ ల చేత కూడా విజిల్స్ వేయిస్తాను అన్నాడట. ఇప్పుడు సోషల్ మీడియాలో బాహుబలి ఎపిక్ కు సంబందించిన హడావిడి చూస్తుంటే ఇలానే అనిపిస్తుంది
Swetha
 
        
బాహుబలి మొదటి భాగం వచ్చి పదేళ్లు అయింది. ఈ సినిమా రావడమేమో కానీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది. రాజమౌళి రాజమౌళి ఏమి చేస్తావ్ అని అడిగితే తెలుగు రాని ఎన్ఆర్ఐ ల చేత కూడా విజిల్స్ వేయిస్తాను అన్నాడట. ఇప్పుడు సోషల్ మీడియాలో బాహుబలి ఎపిక్ కు సంబందించిన హడావిడి చూస్తుంటే ఇలానే అనిపిస్తుంది. కొన్ని వందల సార్లు చూసిన సినిమాకు ఇప్పుడు మరోసారి ఇంత ఆదరణ లబిస్తుంటే ముచ్చటగా అనిపిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం రీ రిలీజ్ లో రూ.100 కోట్లు సాధించిన సినిమాగా కొత్త రికార్డులు సృష్టించడానికి బాహుబలి ఎపిక్ సిద్ధం అవుతుంది.
కాబట్టి బాహుబలి 3 ని అనౌన్స్ చేయడానికి ఇంతకంటే శుభ సమయం మరొకటి ఉండదు. ఎందుకంటే పదేళ్ల తర్వాత వచ్చినా ఈ ఎపిక్ పార్ట్ ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తుంది. డార్లింగ్ అభిమానులకైతే పండగే.. పాత మెమరీస్ ను ఒక్కసారి రికాల్ చేసుకుంటూ ఇప్పుడు ఈ రీరిలీజ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫ్రాంచైజ్ ను కొనసాగిస్తే చూడాలని సగటు ప్రేక్షకుడి కోరిక. అందులో చెప్పడానికి ఇంకా కథ ఏముంది అని అనుకోడానికి లేదు. ఎందుకంటే బాహుబలిలో ఉండే ప్రతి క్యారెక్టర్ తో ఓ కొత్త కథ బిల్డ్ చేయొచ్చు.
ఇప్పటికే కట్టప్ప పాత్రతో ఓ సినిమా తీస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో బాహుబలి టీమ్ ఉన్నట్టు ఆ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కాకపోతే ఆ ప్రాజెక్ట్ ను రాజమౌళి డీల్ చేయకుండా ఆ బాధ్యత ఇంకెవరికైనా అప్పగిస్తారని టాక్. దీనిని ఇంకా అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయలేదు. అలాగే శివగామి , భల్లాలదేవ ఇలా సెపరేట్ గా ఆ క్యారెక్టర్స్ చుట్టూ వరల్డ్ బిల్డ్ చేసుకుని.. కనీసం యానిమేషన్ మూవీస్ తీసిన ప్రేక్షకులు హ్యాపీనే. ఎపిక్ కిక్ లో జక్కన్న ఏదైనా కిక్కిచ్చే న్యూస్ చెప్తాడేమో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
