iDreamPost
android-app
ios-app

OTT లో మార్వెల్ యూనివర్స్ నుంచి న్యూ సిరీస్

  • Published Oct 27, 2025 | 3:55 PM Updated Updated Oct 27, 2025 | 3:55 PM

మార్వెల్ , డిసి యూనివర్స్ లో ఉండే సూపర్ హీరోల సినిమాలకు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చేది. కానీ ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలకు అలాంటి క్రేజ్ రావడం లేదు. కానీ ఈ ఏడాది జూలై లో వచ్చిన ద ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అయింది.

  • Published Oct 27, 2025 | 3:55 PMUpdated Oct 27, 2025 | 3:55 PM
OTT లో మార్వెల్ యూనివర్స్ నుంచి న్యూ  సిరీస్

మార్వెల్ , డిసి యూనివర్స్ లో ఉండే సూపర్ హీరోల సినిమాలకు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చేది. కానీ ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలకు అలాంటి క్రేజ్ రావడం లేదు. కానీ ఈ ఏడాది జూలై లో వచ్చిన ద ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అయింది. జూలై 25న ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. టాక్ పరంగా బావున్నా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రంగా అంత సాధించలేకపోయింది.

ఇక ఇప్పుడు ఈ సినిమా నవంబర్ 5 నుంచి హాట్‌స్టార్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. ఇలాంటి సూపర్ హీరో జానర్స్ సినిమాలకు ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి. ఈ సినిమా కథ విషయానికొస్తే.. రీడ్ రిచర్డ్ , స్యూ స్ట్రామ్ , జానీ స్ట్రామ్ , బెన్ .. ఓ టీంగా ఉండే వీళ్లు ఆస్ట్రోనాట్స్. అందరూ వీళ్లని ఫెంటాస్టిక్ ఫోర్ అని పిలిచేవాళ్ళు. భూమిని కాపాడటమే వీళ్ల పని. స్యూ ప్రెగ్నెంట్ కావడంతో ఈమెకు పుట్టబోయే బిడ్డకు కూడా సూపర్ పవర్స్ వస్తాయా అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు.

అలాంటి టైంలో గలాక్టస్ భూమిని అంతం చేయబోతున్నాడని తెలుస్తుంది. స్యూకి పుట్టబోయే బిడ్డని తనకు ఇస్తే.. భూమిని, మనుషుల్ని విడిచిపెడతానని గలాక్టస్ చెబుతారు. ఆ తర్వాత ఏమైంది ? వీరు భూమిని కాపాడారా లేదా ? చివరకు ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.