Swetha
మళ్ళీ సంక్రాంతి వస్తే హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యి రెండేళ్లు పూర్తవుతుంది. ఈ సినిమా ముందు వరకు హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ , హీరో తేజ సజ్జా కు అంత క్రేజ్ ఏమి లేదు. దీని ముందు కూడా ఇద్దరు చాలానే సినిమాకు తీశారు కానీ.. ఈ సినిమా తర్వాత వీరి రేంజ్ అంతా మారిపోయింది.
మళ్ళీ సంక్రాంతి వస్తే హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యి రెండేళ్లు పూర్తవుతుంది. ఈ సినిమా ముందు వరకు హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ , హీరో తేజ సజ్జా కు అంత క్రేజ్ ఏమి లేదు. దీని ముందు కూడా ఇద్దరు చాలానే సినిమాకు తీశారు కానీ.. ఈ సినిమా తర్వాత వీరి రేంజ్ అంతా మారిపోయింది.
Swetha
 
        
మళ్ళీ సంక్రాంతి వస్తే హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యి రెండేళ్లు పూర్తవుతుంది. ఈ సినిమా ముందు వరకు హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ , హీరో తేజ సజ్జా కు అంత క్రేజ్ ఏమి లేదు. దీని ముందు కూడా ఇద్దరు చాలానే సినిమాకు తీశారు కానీ.. ఈ సినిమా తర్వాత వీరి రేంజ్ అంతా మారిపోయింది. దానితో అటు హీరోగా తేజ సజ్జా మీద ఇటు దర్శకుడిగా ప్రశాంత్ వర్మ మీద అందరికి అంచనాలు పెరిగిపోయాయి. తేజ సజ్జా అయితే ఈ ఏడాది మిరాయ్ తో వచ్చి మురిపించాడు. కానీ ప్రశాంత్ వర్మ సైడ్ నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు.
రిషబ్ శెట్టితో జై హనుమాన్ ప్రకటించి నెలలు గడిచిపోయాయి. కానీ రెగ్యులర్ షూట్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ప్రభాస్ తో ప్లాన్ చేసుకున్న బ్రహ్మ రాక్షస్ ఉంటుందా అంటే అదీ సందేహమే. ఇక తాను కథలు ఇచ్చిన సినిమాలు మాత్రం వేరే డైరెక్టర్స్ పర్యవేక్షణలో స్లో స్లో గా సాగుతున్నాయి. ఓజి టైంలో అధీరా పోస్టర్ వదిలారు. ఇక రీసెంట్ గా మహాకాళి పోస్టర్ వదిలారు. బాలకృష్ణ కొడుకును లాంచ్ చేసే బాధ్యత ప్రశాంత్ వర్మదే అన్నారు. ఇక అంతే ఇంతకుమించి వర్మ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు.
రణ్వీర్ సింగ్ తో ప్లాన్ చేసుకున్న బాలీవుడ్ మూవీ హఠాత్తుగా క్యాన్సిల్ అవ్వడం, ఆ తర్వాత మోక్షజ్ఞని పరిచయం చేసే సినిమా బాధ్యతను బాలకృష్ణ ముందు ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టి అర్ధాంతరంగా రద్దు చేసుకోవడం.. ఈ రెండు వర్మ కెరీర్ కు స్పీడ్ బ్రేకర్లుగా మారాయి. ఇలాంటి క్రియేటివ్ డైరెక్టర్స్ రెండు మూడేళ్ళకో సినిమా చేయడం అంటే.. ఆడియన్స్ కు కాస్త ఇబ్బందిగానే ఉంటుందు. మినిమమ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వారు ప్రశాంత్ వర్మ నుంచి ఎదో ఓ అప్డేట్ ఆశిస్తున్నారు. ఇక వర్మ ఏమి చేస్తాడో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
