iDreamPost
android-app
ios-app

ఎపిక్ ఎఫెక్ట్ ఇప్పుడు పుష్ప పై !

  • Published Oct 31, 2025 | 12:21 PM Updated Updated Oct 31, 2025 | 12:21 PM

ప్రస్తుతం బాహుబలి ఎపిక్ ట్రెండ్ కొనసాగుతుంది. కొన్ని వందల సార్లు చూసినా సినిమానే అయినా సరే.. రెండు పార్ట్స్ కలిపి రిలీజ్ చేస్తున్నారంటే జనం ఎగబడి చూస్తున్నారు. మీడియా సోషల్ మీడియాలో రీరిలీజ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలు వైరల్ అవుతున్నాయి. స్ట్రెయిట్ మూవీకి ఉన్నంత క్రేజ్ ఉంది. ఓ కథను రెండు పార్ట్స్ గా తీసి చూపించడం స్టార్ట్ చేసింది రాజమౌళినే.

  • Published Oct 31, 2025 | 12:21 PMUpdated Oct 31, 2025 | 12:21 PM
ఎపిక్ ఎఫెక్ట్ ఇప్పుడు పుష్ప పై !

ప్రస్తుతం బాహుబలి ఎపిక్ ట్రెండ్ కొనసాగుతుంది. కొన్ని వందల సార్లు చూసినా సినిమానే అయినా సరే.. రెండు పార్ట్స్ కలిపి రిలీజ్ చేస్తున్నారంటే జనం ఎగబడి చూస్తున్నారు. మీడియా సోషల్ మీడియాలో రీరిలీజ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలు వైరల్ అవుతున్నాయి. స్ట్రెయిట్ మూవీకి ఉన్నంత క్రేజ్ ఉంది. ఓ కథను రెండు పార్ట్స్ గా తీసి చూపించడం స్టార్ట్ చేసింది రాజమౌళినే. దీనిని అంతా తెగ ఫాలో అయిపోయారు. ఇక ఇప్పుడు మరో ట్రెండ్ సెట్ చేయడంతో అందరి కన్ను దీని మీద పడింది.

బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో హైప్ సంపాదించుకున్న సినిమా ఏదైనా ఉందంటే.. అది పుష్ప సినిమానే. పుష్పను మొద‌లుపెట్టిన‌పుడు దాన్ని ఒక సినిమాగానే తీయాలని అనుకున్నారట. కానీ త‌ర్వాత ఆలోచ‌న మార్చుకుని బాహుబలిని ఫాలో అవుతూ రెండు భాగాలుగా తీసాడు సుకుమార్. ఇక అప్పుడు రాజమౌళి బాహుబలి ఎపిక్ విజన్ వర్కౌట్ అవ్వడంతో.. సుక్కు కూడా పుష్ప సినిమాను ఒకే భాగంగా రిలీజ్ చేస్తాడేమో అనే ఆసక్తి మొదలైంది. ముఖ్యంగా నార్త్ లో పుష్ప కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలియనిది కాదు.

పుష్ప రెండు భాగాల‌ను క‌లిపి ఒక సినిమాగా తీస్తే నార్త్ నుంచి బాగా రెస్పాన్స్ వస్తుందని చెప్పడంలో.. ఎలాంటి సందేహం లేదు. తెలుగులో ఎలానూ చూస్తారు ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇది ఇప్పట్లో అయ్యే పని కాదు. కొన్నాళ్ళు గడిచాకా అప్పుడు దీని గురించి ఆలోచిస్తే బెటర్ అని ఇన్సైడ్ టాక్. ముందు ముందు ఏమి జరుగుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.