ప్రేమోన్మాదంతో పెచ్చరిల్లుతున్న కిరాతకులకు తీవ్ర హెచ్చరిక లాంటి తీర్పును గుంటూరు ప్రత్యేక కోర్టు వెలువరించింది. సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాంగోపాల్ శుక్రవారం తీర్పు ఇచ్చారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంత దారుణానికి ఒడిగట్టినా నిందితుడిలో ఇసుమంతైనా మార్పు రాలేదని, అతని మాటతీరు, వ్యవహారశైలి చూస్తే అతనిలో తప్పు చేశానన్న భావన కనిపించలేదని.. పశ్చాత్తాపం కూడా లేకపోగా విచారణ […]
మాజీ ఉప ముఖ్యమంత్రి, పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు పాముల పుష్ప శ్రీవాణి ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె మామగారైన మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర రాజు (72) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కొన్నాళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన విశాఖలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. సమాచారం తెలిసిన వెంటనే కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. చంద్రశేఖర రాజు మృతదేహాన్ని స్వగ్రామమైన కురుపాం నియోజకవర్గంలోని చినమేరంగి […]
గత కొద్దిరోజులుగా కాంగ్రెస్, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చుట్టూ తిరుగుతున్న రాజకీయాలలో అతిపెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. 2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ను ధీటుగా నిలబెట్టి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రశాంత్ కిషోర్ తో ఆ పార్టీ వరుసపెట్టి సమావేశాలు నిర్వహించడం, ఈరోజో రేపో పీకే కాంగ్రెస్ లో చేరి, కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారని ప్రచారం జరుగుతున్న తరుణంలో.. ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరడంలేదని ప్రకటన రావడం రాజకీయవర్గాలను విస్మయానికి గురిచేసింది. ఈ […]
రాజకీయాల్లోకి వచ్చినా.. మంత్రిగా ఎదిగినా.. ఆపదలో ఉన్న వారికి, పేదలకు సేవ చేయడానికి ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించరు. అదే సుగుణం మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును పేదల పెన్నిధిగా నిలిపింది. ఇదే క్రమంలో మంత్రి అప్పలరాజులోని పేదల వైద్యుడు మరోసారి బయటకొచ్చాడు. తక్షణ వైద్య సేవలతో ముగ్గురికి పునర్జన్మ ప్రసాదించాడు. ఇద్దరు బిడ్డలతో సహా తల్లిని ప్రాణాపాయం నుంచి బయటపడేశాడు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ ఘటనలో మంత్రి స్పందించిన తీరు సర్వత్రా ప్రశంసలు […]
వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు గానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదన్నది సహజ న్యాయసూత్రం. కానీ అక్కడ ఆ న్యాయసూత్రం అమలు కాలేదు. ఒక హత్య కేసులో అనుమానితుడు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 28 ఏళ్లు అన్యాయంగా జైలులో మగ్గిపోయాడు. విచారణ మధ్యలో నిలిచిపోవడం, కనీసం బెయిల్ కూడా లభించక పోవడంతో అతని విలువైన యవ్వనమంతా జైలు ఊచల మధ్యే కరిగిపోయింది. ఇంత జరిగినా అతనే దోషిగా తేలిందా అంటే అదీ లేదు. నిందితుడిపై […]
అధికారం కోల్పోయి.. నేతలు, కార్యకర్తలు చెల్లాచెదురైపోయి కుంగిపోయిన తెలుగుదేశం పార్టీ.. మళ్లీ శక్తియుక్తులను కూడదీసుకుని నిలబడేందుకు నానాపాట్లు పడుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బాధ్యతలు చేపట్టే ఇంఛార్జీల నియామకానికి కొన్ని నెలలుగా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. ఇంఛార్జీలను నియమిస్తున్న కొన్ని చోట్ల కొత్త ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి అలాగే తయారైంది. అక్కడ ఇప్పటికే ఇద్దరు నాయకులు అధిష్టానం పెద్దలు ఇచ్చిన భరోసాతో వచ్చే ఎన్నికల్లో […]
కర్నూలు జిల్లాలో ఒకప్పుడు గట్టి పట్టు కలిగిన తెలుగుదేశానికి ఆదోని నియోజకవర్గంలో మాత్రం మిశ్రమ ఫలితాలు లభించాయి. పార్టీ ఆవిర్భవించిన 1983 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో నాలుగుసార్లే అక్కడ విజయం సాధించగలిగింది. అందులోనూ మూడుసార్లు మీనాక్షి నాయుడే ఎన్నికయ్యారు. గత సార్వత్రిక ఎన్నికలతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చిత్తుగా ఓడిపోయి పతనావస్థకు చేరిన టీడీపీని అంతర్గత పోరు మరింత కుంగదీస్తోంది. పార్టీ ఇంఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడిపై ఆయన మాజీ […]
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీ మేరకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ప్రజాసంకల్ప యాత్రలోనూ, ఎన్నికల ప్రచారంలోనూ ఇచ్చిన హామీ ప్రకారం సీఎం జగన్ సంక్షేమం, అభివృద్ధి ప్రధాన అజెండాగా పాలన సాగిస్తున్నారు. కరోనా సంక్షోభ సమయంలోనూ సంక్షేమానికి లోటు లేకుండా చూసిన జగన్ అధికారంలో ఉన్నంతకాలం ఈ పథకాలకు ఢోకా ఉండదని తేటతెల్లమైంది. కానీ వీటిపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం చేస్తున్న అల్లరి, అదేపనిగా […]
ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడమే కాకుండా అనూహ్యంగా మంత్రి పదవి కూడా కొట్టేశారు. కానీ ఆ పదవి మూడేళ్ల ముచ్చటగానే మారింది. దాంతో అలకబూని పార్టీ మార్చేశారు. అక్కడా ఉండలేక ఇంకో పార్టీలోకి.. ఇలా మూడు పార్టీలు మారి.. తాజాగా మళ్లీ తన తొలి పార్టీలోకి మారేందుకు సిద్ధం అవుతున్న ఆ నేత మాజీమంత్రి రావెల కిషోర్ బాబు. టీడీపీతో రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన ఎనిమిదేళ్లలోనే టీడీపీ, […]
మనది ప్రజాస్వామ్యం. ప్రపంచంలో మనదే గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థ అనే మంచి పేరుంది. ఈ వ్యవస్థలో రాజకీయ పార్టీలదే కీలకపాత్ర. ఎన్నికల ద్వారా ఈ పార్టీల నేతలనే ప్రజలు తమ ప్రతినిధులుగా ఎన్నుకుని చట్టసభలకు పంపుతుంటారు. పార్టీలు, వాటి నేతలు కూడా తమను ఎన్నుకునే ప్రజలు, పరిపాలన విషయంలో అంతే బాధ్యతగా, హుందాగా వ్యవహరించాలి. ఎన్నికల పోరాటంలో, ప్రజాసమస్యల పరిష్కారం విషయంలో రాజకీయ పార్టీల మధ్య సిద్ధాంత వైరుధ్యాలు, అభిప్రాయ బేధాలు ఉండటం చాలా సహజం. ఈ […]