iDreamPost
android-app
ios-app

రామ్ ఇకపై రూట్ మార్చాల్సిందేనా !

  • Published Dec 12, 2025 | 10:30 AM Updated Updated Dec 12, 2025 | 10:30 AM

ఒకప్పుడు రామ్ సినిమాలు వేరు ఇప్పుడు రామ్ తీస్తున్న సినిమాలు వేరు. ఇస్మార్ట్ శంకర్ హిట్ అవ్వడంతో రామ్ కంప్లీట్ గా ఫ్యామిలీ లవ్ జోనర్ ను వదిలి మాస్ యాంగిల్ లో కి వచ్చేసాడు. అదే అతనికి తిప్పలు తెచ్చిపెడుతుంది. రీసెంట్ గా రిలీజ్ అయినా ఆంధ్ర కింగ్ తాలూకతో అయినా హిట్ కొడతాడని అనుకుంటే అది కూడా అవ్వలేదు.

ఒకప్పుడు రామ్ సినిమాలు వేరు ఇప్పుడు రామ్ తీస్తున్న సినిమాలు వేరు. ఇస్మార్ట్ శంకర్ హిట్ అవ్వడంతో రామ్ కంప్లీట్ గా ఫ్యామిలీ లవ్ జోనర్ ను వదిలి మాస్ యాంగిల్ లో కి వచ్చేసాడు. అదే అతనికి తిప్పలు తెచ్చిపెడుతుంది. రీసెంట్ గా రిలీజ్ అయినా ఆంధ్ర కింగ్ తాలూకతో అయినా హిట్ కొడతాడని అనుకుంటే అది కూడా అవ్వలేదు.

  • Published Dec 12, 2025 | 10:30 AMUpdated Dec 12, 2025 | 10:30 AM
రామ్ ఇకపై రూట్ మార్చాల్సిందేనా !

ఒకప్పుడు రామ్ సినిమాలు వేరు ఇప్పుడు రామ్ తీస్తున్న సినిమాలు వేరు. ఇస్మార్ట్ శంకర్ హిట్ అవ్వడంతో రామ్ కంప్లీట్ గా ఫ్యామిలీ లవ్ జోనర్ ను వదిలి మాస్ యాంగిల్ లో కి వచ్చేసాడు. అదే అతనికి తిప్పలు తెచ్చిపెడుతుంది. రీసెంట్ గా రిలీజ్ అయినా ఆంధ్ర కింగ్ తాలూకతో అయినా హిట్ కొడతాడని అనుకుంటే అది కూడా అవ్వలేదు. సినిమాకు నెగెటివ్ టాక్ ఏమి రాలేదు లే కానీ అలా అని మరీ అంత హిట్ కూడా అవ్వలేదు. కనీసంలో కనీసం మూడు వారాల ప్రొపర్ రన్ ఇవ్వలేకపోయింది.

థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి ఈ సినిమా ముప్పై కోట్ల కలెక్షన్స్ ను అందుకుందట. సినిమాలో ఉన్నది అందరూ పెద్ద స్టార్లే, ప్రొడక్షన్ హౌస్ లు కూడా పేరు ఉన్నవే.. ఇలాంటి కథ చెప్పాలనుకున్న దర్శకుడి ఉద్దేశము మంచిదే. కానీ ఎక్కడో అది ప్రేక్షకులకు రీచ్ అవ్వడంలో సక్సెస్ కాలేకపోయింది. కాబట్టి రామ్ ఇకనుంచైనా కథలను ఎంచుకోడంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని అంటున్నారు . ఓ హీరోకి ప్లాపులు రావడం కొత్తేమీ కాదు. చిరంజీవి , నాగార్జున , ఎన్టీఆర్ లాంటి వాళ్ళకే కొన్ని డిజాస్టర్లు తప్పలేదు. కానీ ఇక్కడ రామ్ పరిస్థితి వేరే వారిలా అంత ఈజీగా కంబ్యాక్ అయ్యేంత మార్కెట్ రామ్ ఇంకా సంపాదించుకోలేదు.

కాబట్టి ఇక మీదట రామ్ తనకు సెట్ అయ్యే ఫ్యామిలీ అండ్ లవ్ జోనర్ లోనే సినిమాలు తీస్తే.. ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రామ్ హర్రర్ జోనర్ వైపు చూస్తున్నాడని టాక్. దానిని కొత్త దర్శకుడు హ్యాండిల్ చేయబోతున్నాడట. అటు సముద్రఖని కూడా రామ్ కు ఓ కథను చెప్పాడట. దానికి సంబందించిన అనౌన్సుమెంట్ త్వరలోనే ఇవ్వనున్నారని టాక్. ఇక ఇప్పుడు రామ్ రూట్ మారుస్తాడా ఎలాంటి కథను ఎంచుకుంటాడు అనేది చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.