Swetha
ఎవరు ఊహించని విధంగా అఖండ 2 వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా కూడా ఈ విషయం గురించే చర్చలు జరుగుతున్నాయి. ఇంతవరకు అఖండ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు . అదిగో ఇదిగో అంటున్నారు కానీ అసలు డేట్ మాత్రం చెప్పలేదు.

ఎవరు ఊహించని విధంగా అఖండ 2 వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా కూడా ఈ విషయం గురించే చర్చలు జరుగుతున్నాయి. ఇంతవరకు అఖండ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు . అదిగో ఇదిగో అంటున్నారు కానీ అసలు డేట్ మాత్రం చెప్పలేదు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడడం అనేది మిగిలిన సినిమాలకు కలిసొచ్చినట్టు అయింది.
ఈ డిసెంబర్ లో అఖండ 2 కాకుండా చాలానే చిన్న సినిమాలు రిలీజ్ కానున్నాయి. అంతకముందు వాయిదా వేసుకున్న నిర్మాతలు కూడా ఇప్పుడు క్యూ కడుతున్నారు. ఈ వారం థియేటర్లో ఏకంగా 16 సినిమాలు రిలీజ్ కానున్నాయి. అఖండ 2 కోసం అగ్రిమెంట్ చేసుకున్న థియేటర్స్ లో ఈ సినిమాలను రిలీజ్ చేయనున్నారు. నందు సైక్ సిద్దార్ధ్ , సహకుటుంబానాం, మోగ్లీ, ఇషా, అన్నగారు వస్తారు,పైసావాలా, వన్ బై ఫోర్, డ్రైవ్ లాంటి చిన్న సినిమాలు థియేటర్స్ లో ఎంట్రీ ఇవ్వనున్నాయి.
అఖండ 2 పోస్ట్ పోన్ అయినందుకు ఫ్యాన్స్ వర్రీ అవుతున్నా.. చిన్న సినిమాలకు మాత్రం ఇది బాగానే కలిసి వచ్చిందని చెప్పాలి. ఇక ఈ సినిమాలు ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్టైన్ చేస్తాయో చూడాలి. మరో వైపు ఇంటర్నెట్ లో అఖండ-2పై కొత్త ట్రెండ్ మొదలైంది. #WeWantAkhanda2OnDec12th అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఈ విషయంలో క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.