Swetha
సాదా సీదాగా ఉండే హీరోని ఒప్పించి ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇవ్వాలంటే అది రాజమౌళికి సాధ్యం. ఇప్పుడు మహేష్ రాజమౌళి సినిమానే మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. ఆల్రెడీ టైటిల్ లాంచ్ ఈవెంట్ లో సినిమా పేరు మహేష్ రుద్ర లుక్ ని రివీల్ చేశారు. ఇది కాకుండా రాముడుగా మహేష్ బాబు ఎంత అందంగా ఉన్నాడో కూడా రాజమౌళి చెప్పేసారు .

సాదా సీదాగా ఉండే హీరోని ఒప్పించి ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇవ్వాలంటే అది రాజమౌళికి సాధ్యం. ఇప్పుడు మహేష్ రాజమౌళి సినిమానే మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. ఆల్రెడీ టైటిల్ లాంచ్ ఈవెంట్ లో సినిమా పేరు మహేష్ రుద్ర లుక్ ని రివీల్ చేశారు. ఇది కాకుండా రాముడుగా మహేష్ బాబు ఎంత అందంగా ఉన్నాడో కూడా రాజమౌళి చెప్పేసారు . సో వారణాసిలో మహేష్ రెండు లుక్స్ లో కనిపించబోతున్నారనే క్లారిటీ ఇప్పటికే వచ్చేసింది. ఇప్పటివరకు మహేష్ డ్యూయల్ రోల్ చేసిందే లేదు. కానీ ఈ సినిమాలో రెండు లుక్స్ లో కనిపించడం అనేది అందరికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
ఇదే పెద్ద సర్ప్రైజ్ అనుకుంటే.. ఇప్పుడు ఎవరు ఊహించని కని విని ఎరుగని ఓ అప్డేట్ వచ్చింది. వారణాసిలో మహేష్ ఏకంగా ఐదు అవతారాల్లో కనిపించబోతున్నాడంట. సినిమాలో చాలా యుగాలు చూపించారు. బహుశా యుగానికి ఓ అవతారంలో మహేష్ నే చూపించే అవకాశం లేకపోలేదు. కేవలం రామాయణానికి సంబంధించిన ఎపిసోడ్ అరగంటకు పైగా ఉండబోతుందంట. ఆ 30 నిమిషాలూ అభిమానులకు పక్కా గూస్బంప్స్ ఇస్తాయని ఇన్సైడ్ టాక్. ఇక మిగిలిన గెటప్స్ లో ఒక దానికి సంబందించిన షూట్ కూడా కంప్లీట్ అయిందట. ఇంకా రెండు మాత్రమే బ్యాలన్స్.
ఆ మిగిలిన మూడు గెటప్స్ ఏంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే . రాజమౌళి అయితే వీటిని ఇప్పట్లో రివీల్ చేసే అవకాశం అసలు లేదు. రాజమౌళి అంత దాస్తున్నడంటే కచ్చితంగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ బాగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో మొత్తానికి జక్కన్న మహేష్ ను బాగానే రూపుదిద్దుతున్నాడని అనిపిస్తుంది . ఇక ఏమౌతుందో చూడాలి . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.