Swetha
ప్రస్తుతం ఓటిటి సంస్థలు ఏ రేంజ్ లో పెట్టుబడులు చేస్తున్నాయో తెలియనిది కాదు. ఇక ఈ ఏడాది సౌత్ ఇండియాలో ఏకంగా రూ. 12 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతోందట. తాజాగా దీనికి సంబంధించి తమిళనాడులో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తో అగ్రిమెంట్ కూడా చేసుకుంది.

ప్రస్తుతం ఓటిటి సంస్థలు ఏ రేంజ్ లో పెట్టుబడులు చేస్తున్నాయో తెలియనిది కాదు. ఇక ఈ ఏడాది సౌత్ ఇండియాలో ఏకంగా రూ. 12 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతోందట. తాజాగా దీనికి సంబంధించి తమిళనాడులో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తో అగ్రిమెంట్ కూడా చేసుకుంది. రాబోయే ఐదు సంవత్సరాలలో ఇలా 12 కోట్ల పెట్టుబడి పెట్టబోతుందట . ఈ కార్యక్రమానికి నాగార్జున , మోహన్ లాల్ , కమల్ హాసన్ లాంటి వారు చీఫ్ గెస్ట్ ల గా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉదయనిధి మాట్లాడుతూ, ‘జియో హాట్ స్టార్ తీసుకున్న ఈ నిర్ణయంతో తమిళనాడులో యంగ్ క్రియేటివ్ పీపుల్ కు మరిన్ని అవకాశాలు లభిస్తాయని, కొత్త ఉద్యోగాలు వస్తాయ’ని అన్నారు. జియో హాట్ స్టార్ సంస్థ ఫిల్మ్ మేకర్స్, రైటర్స్, ఎడిటర్స్, డిజిటల్ స్టోరీ టెల్లర్స్ ను ప్రోత్సహించేందుకు వర్క్ షాప్స్ ను నిర్వహిస్తుందని, దీని ద్వారా ప్రత్యక్షంగా వెయ్యి మందికి, పరోక్షంగా పదిహేను వేలమందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. అలాగే జియో హాట్ స్టార్ ‘బ్లాక్ బస్టర్ సౌత్ లైనప్’ పేరుతో 25 న్యూ టైటిల్స్ ను ప్రకటించింది. ఇక ముందు ముందు ఈ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ నుంచి ఎలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.