iDreamPost
android-app
ios-app

వారణాసి కల్కి 2 కి కలిసొచ్చినట్టుంది

  • Published Dec 06, 2025 | 6:45 PM Updated Updated Dec 06, 2025 | 6:45 PM

రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో రానున్న వారణాసికి ఇప్పటినుంచే క్రేజ్ పెరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నట్లు పరిచయం చేసారు జక్కన్న. గ్లోబల్ రేంజ్ లో ఇప్పుడు ఈ కాంబినేషన్ కు క్రేజ్ పెరిగిపోయింది. సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకో రెండేళ్లు ఈజీగా పడుతుంది.

రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో రానున్న వారణాసికి ఇప్పటినుంచే క్రేజ్ పెరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నట్లు పరిచయం చేసారు జక్కన్న. గ్లోబల్ రేంజ్ లో ఇప్పుడు ఈ కాంబినేషన్ కు క్రేజ్ పెరిగిపోయింది. సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకో రెండేళ్లు ఈజీగా పడుతుంది.

  • Published Dec 06, 2025 | 6:45 PMUpdated Dec 06, 2025 | 6:45 PM
వారణాసి కల్కి 2 కి కలిసొచ్చినట్టుంది

రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో రానున్న వారణాసికి ఇప్పటినుంచే క్రేజ్ పెరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నట్లు పరిచయం చేసారు జక్కన్న. గ్లోబల్ రేంజ్ లో ఇప్పుడు ఈ కాంబినేషన్ కు క్రేజ్ పెరిగిపోయింది. సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకో రెండేళ్లు ఈజీగా పడుతుంది. అయినాసరే ఇప్పటినుంచే ఈ స్టార్స్ మీద మిగిలిన దర్శకులు ఓ కన్నేసి ఉంచుతున్నారు. ఇక ఇప్పుడు వారణాసి పుణ్యమా అని కల్కి 2 కి కూడా హీరోయిన్ దొరికేసిందనే టాక్ వినిపిస్తుంది.

కల్కి సినిమాకు ఎలాంటి రికార్డ్స్ లభించాయో తెలియనిది కాదు. అయితే మొన్నీమధ్యనే ఈ సినిమా నుంచి దీపికాపదుకునే తప్పుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. దీనితో ఆ ప్లేస్ ను ఎవరు రీప్లేస్ చేస్తారా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమా హీరోయిన్ విషయంలో ఎన్నో రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అనుష్క నటించబోతున్నారని సాయి పల్లవి నటించబోతున్నారని రూమర్స్ వచ్చాయి. కానీ టీం నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు.

అయితే ఇప్పుడు వారణాసి ఈవెంట్ లో ప్రియాంకను చూసిన తర్వాత.. కల్కి 2 లో దీపికా పాత్రను ప్రియాంక ఈజీగా రీప్లేస్ చేస్తుందని అంతా అనుకుంటున్నారు. ఒకవేళ ఇదే నిజం అయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ప్రియాంక ఆ క్యారెక్టర్ ను ఈజీగా క్యారీ చేసేయగలదని అందరికి తెలిసిన విషయమే. త్వరలోనే దీని గురించి ఏదైనా క్లారిటీ వచ్చే అవకాశం లేకపోలేదు. మొత్తానికి వారణాసి పుణ్యమా అని కల్కి 2 కి హీరోయిన్ దొరికేసింది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.