iDreamPost
android-app
ios-app

సూపర్ మ్యాన్ లా సూపర్ గర్ల్.. తెలుగు ట్రైలర్ రిలీజ్

  • Published Dec 12, 2025 | 1:40 PM Updated Updated Dec 12, 2025 | 1:40 PM

ఇప్పటికే సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ లాంటి ఎన్నో సినిమాలు చూసి ఉంటాము. ఇలాంటి సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు హాలీవుడ్ అభిమానులను టాలీవుడ్ అభిమానులను కూడా అలరించేందుకు ఇంకో కొత్త సూపర్ హీరో కథ రెడీ అయింది. నిజానికి సూపర్ హీరో అనడం కంటే హీరోయిన్ అనొచ్చేమో.

  • Published Dec 12, 2025 | 1:40 PMUpdated Dec 12, 2025 | 1:40 PM
సూపర్ మ్యాన్ లా సూపర్ గర్ల్.. తెలుగు ట్రైలర్ రిలీజ్

ఇప్పటికే సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ లాంటి ఎన్నో సినిమాలు చూసి ఉంటాము. ఇలాంటి సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు హాలీవుడ్ అభిమానులను టాలీవుడ్ అభిమానులను కూడా అలరించేందుకు ఇంకో కొత్త సూపర్ హీరో కథ రెడీ అయింది. నిజానికి సూపర్ హీరో అనడం కంటే హీరోయిన్ అనొచ్చేమో. సూపర్ మ్యాన్ చెల్లెలిల సూపర్ గర్ల్ పేరిట ఓ సినిమా థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. తాజాగా దానికి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ ను గమనిస్తే… సేమ్ సూపర్ మ్యాన్ లానే.. అతనిపైనే జోక్స్ వేస్తూ ఫన్నీగా కనిపిస్తూనే.. ఆపద వచ్చినప్పుడు తన పవర్స్ అన్నీ బయటకు తీసుకోవచ్చే సూపర్ పవర్స్ ఉన్న అమ్మాయిలా మిల్లి ఆల్కాక్ అదరగొట్టిందని చెప్పి తీరాల్సిందే. అలాగే యాక్షన్ సీన్స్ కూడా ఎక్కడా తగ్గకుండా అదే రేంజ్ లో చూపించారు. DC స్టూడియోస్, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ నుంచి వస్తున్నా.. ఈ సినిమాకు అనా నొగ్వేరా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను 2026 జూన్ 26 న ప్రేక్షకుల ముందు తీసుకురానున్నారట. ఇంగ్లీష్ తో పాటు తెలుగు , అన్నీ ప్రాంతీయ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ కానుందట. ఇక ముందు ముందు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.