iDreamPost
android-app
ios-app

చాలా రోజులకు హౌస్ ఫుల్ బోర్డులు..

  • Published Dec 12, 2025 | 3:54 PM Updated Updated Dec 12, 2025 | 3:54 PM

సినిమా కథ బావుందా కంటెంట్ బావుందా సూపర్ హిట్ ఆ కాదా.. కాసేపు ఇవన్నీ పక్కన పెట్టేస్తే.. సినిమా థియేటర్లోకి ఎంట్రీ ఇవ్వడం లేట్ అయినా కూడా అడ్వాన్స్ బుకింగ్స్ లో ఎలాంటి జాప్యం జరగలేదు. అందుకు అభిమానులను మెచ్చుకోవలసిందే. ముందు నుంచి సినిమా మీద ఎలాంటి పోజిటివ్ టాక్ వచ్చిందో.. లేట్ అయినా కూడా ఎక్కడా నెగిటివి రాలేదు.

సినిమా కథ బావుందా కంటెంట్ బావుందా సూపర్ హిట్ ఆ కాదా.. కాసేపు ఇవన్నీ పక్కన పెట్టేస్తే.. సినిమా థియేటర్లోకి ఎంట్రీ ఇవ్వడం లేట్ అయినా కూడా అడ్వాన్స్ బుకింగ్స్ లో ఎలాంటి జాప్యం జరగలేదు. అందుకు అభిమానులను మెచ్చుకోవలసిందే. ముందు నుంచి సినిమా మీద ఎలాంటి పోజిటివ్ టాక్ వచ్చిందో.. లేట్ అయినా కూడా ఎక్కడా నెగిటివి రాలేదు.

  • Published Dec 12, 2025 | 3:54 PMUpdated Dec 12, 2025 | 3:54 PM
చాలా రోజులకు హౌస్ ఫుల్ బోర్డులు..

సినిమా కథ బావుందా కంటెంట్ బావుందా సూపర్ హిట్ ఆ కాదా.. కాసేపు ఇవన్నీ పక్కన పెట్టేస్తే.. సినిమా థియేటర్లోకి ఎంట్రీ ఇవ్వడం లేట్ అయినా కూడా అడ్వాన్స్ బుకింగ్స్ లో ఎలాంటి జాప్యం జరగలేదు. అందుకు అభిమానులను మెచ్చుకోవలసిందే. ముందు నుంచి సినిమా మీద ఎలాంటి పోజిటివ్ టాక్ వచ్చిందో.. లేట్ అయినా కూడా ఎక్కడా నెగిటివి రాలేదు. పైగా ఇప్పుడు అఖండ 2 పుణ్యమా అని థియేటర్స్ కళకళలాడుతున్నాయి. నిన్న రాత్రి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ అఖండ 2 తాండవంతో నిండుగా ఉన్నాయి.

చాలా వారాల తర్వాత ఇలా హౌస్ ఫుల్ బోర్డులు కనిపించడంతో థియేటర్ ఓనర్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఒక మాస్ హీరో సినిమా వస్తే ఎలాంటి పండగ హడావిడి ఉంటుందో.. ఇప్పుడు అఖండ 2 రిలీజ్ అప్పుడు కూడా ఇంతే మాస్ యుఫొరియా కనిపిస్తుంది. మధ్యలో ఇలాంటి సినిమాలు రాలేదని కాదు కానీ.. కేవలం కొన్ని సినిమాల విషయంలో మాత్రమే థియేటర్స్ దగ్గర ఇలాంటి పండగ వాతావరణం కనిపిస్తుంది. కేవలం నైజాం ప్రీమియర్ల నుంచే రెండున్నర కోట్ల దగ్గరగా వసూలు రావొచ్చని అంటున్నారు. అలాగే అటు సీడెడ్ లో కూడా అటు ఇటుగా ఇదే నెంబర్ కనిపిస్తుందని అంటున్నారు. ఇప్పుడు దీనిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అఖండ 2 మీద ఉంది.

కలెక్షన్స్ ఎంత ఏంటి అనేది వీకెండ్ కంప్లీట్ అయితే కానీ తెలీదు. కానీ ప్రస్తుతానికి మాత్రం బాలయ్య అభిమానులు సినిమాను ఎంజాయ్ చేసే మూడ్ లో ఉన్నారు. ఫ్యాన్స్ కు మాత్రం ఇది కచ్చితంగా ఐ ఫీస్ట్ అని చెప్పాల్సిందే. మరోసారి బాలయ్య కోసం అభిమానూలు థియేటర్స్ కు వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఇక వీకెండ్ తర్వాత రన్ ఎలా ఉంటుందో చూడాలి . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.