iDreamPost
android-app
ios-app

శాంతారాం బయోపిక్ లో జయశ్రీ గా తమన్నా

  • Published Dec 10, 2025 | 11:56 AM Updated Updated Dec 10, 2025 | 11:56 AM

కొంతకాలంగా బయోపిక్స్ మీద అందరికి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. అందులోను సినీ తారలకు సంబందించిన బయోపిక్స్ అంటే ఆడియన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గానే చూస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన కాంత సినిమా కూడ అలాంటిదే అని ఆ మధ్య టాక్స్ వచ్చాయి. రిలీజ్ తర్వాత కూడా దానిని చాలా మంది జస్టిఫై చేశారు. ఇక ఇప్పుడు మరో బయోపిక్ తెర మీద ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఈ

కొంతకాలంగా బయోపిక్స్ మీద అందరికి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. అందులోను సినీ తారలకు సంబందించిన బయోపిక్స్ అంటే ఆడియన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గానే చూస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన కాంత సినిమా కూడ అలాంటిదే అని ఆ మధ్య టాక్స్ వచ్చాయి. రిలీజ్ తర్వాత కూడా దానిని చాలా మంది జస్టిఫై చేశారు. ఇక ఇప్పుడు మరో బయోపిక్ తెర మీద ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఈ

  • Published Dec 10, 2025 | 11:56 AMUpdated Dec 10, 2025 | 11:56 AM
శాంతారాం బయోపిక్ లో జయశ్రీ గా తమన్నా

కొంతకాలంగా బయోపిక్స్ మీద అందరికి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. అందులోను సినీ తారలకు సంబందించిన బయోపిక్స్ అంటే ఆడియన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గానే చూస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన కాంత సినిమా కూడ అలాంటిదే అని ఆ మధ్య టాక్స్ వచ్చాయి. రిలీజ్ తర్వాత కూడా దానిని చాలా మంది జస్టిఫై చేశారు. ఇక ఇప్పుడు మరో బయోపిక్ తెర మీద ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఈ సినిమా పేరు శాంతారాం. ఇందులో జయశ్రీ క్యారెక్టర్ లో తమన్నా నటించబోతుందట. అసలు ఎవరు ఈ శాంతారా , ఎవరు ఈ జయశ్రీ అనే విషయాలు చూసేద్దాం

ఎదో అన్నీ సినిమాలలో నటించినట్టు జయశ్రీ కూడా కేవలం ఓ క్యారెక్టర్ అనుకుంటే పొరపాటే. ఈ క్యారెక్టర్ వెనుక చాలానే లోతు ఉందట . శాంతారాం అనే వ్యక్తి ఫెమస్ బాలీవుడ్ డైరెక్టర్ . ఆయన తన ప్రయాణంలో 90కి పైగా సినిమాలను నిర్మించి , 55 సినిమాల వరకు దర్శకత్వం వహించారు. ఆయనకు పద్మ విభూషణ్ , దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు దక్కాయి. ఈ బయోపిక్ నుంచి తమన్నా ఫస్ట్ లుక్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. జయశ్రీ ఎవరు అనే విషయానికొస్తే.. ఆమె

శాంతారాం రెండో భార్య. 1941లో పెళ్లి చేసుకున్నారు. ముగ్గురు పిల్లలు. 1956లో విడాకులు తీసుకున్నారు. జయశ్రీ అప్పట్లో టాప్ హీరోయిన్. శాకుంతల, చంద్రరావు మోరే, దహేజ్, డాక్టర్ కోట్నీస్ కి అమర్ కహాని లాంటి సూపర్ హిట్స్ ఆవిడ ఫాలోయింగ్ అమాంతం పెంచేశాయి. శాంతారాంతో పరిచయం, ప్రేమ, పెళ్లి కథ ఏ సినిమాకు తీసిపోని రేంజ్ లో ఉంటాయట. కానీ ఈ వివాహం తర్వాత ఆమె అన్ని విధాలా డౌన్ అయ్యిందట. ఇంచుమించు మహానటి స్టోరీ లా అనిపించొచ్చు కానీ ఇది వేరే. అసలు పూర్తి కథ ఏంటో తెలియాలంటే మాత్రం సినిమా రావాల్సిందే. ఇక ఈ సినిమాలో తమన్నా ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.