iDreamPost
android-app
ios-app

మోగ్లీ టీం కొత్త టెక్నీక్.. రూ.99ల‌కే !

  • Published Dec 11, 2025 | 10:47 AM Updated Updated Dec 11, 2025 | 10:47 AM

ప్రేక్షకులను థియేటర్స్ వరకు రప్పించడం ఇప్పుడు పెద్ద టాస్క్ అయిపోయింది. సినిమాలో బీభత్సమైన కంటెంట్ ఉంటే తప్ప థియేటర్ వరకు రావడం లేదు. లేదా అది చాలా పెద్ద హీరో సినిమా అయ్యి ఉండాలి. లేదంటే ఇంకా ఆ సినిమాను ఓటిటి లో చూడొచ్చులే అని వదిలేస్తున్నారు.

ప్రేక్షకులను థియేటర్స్ వరకు రప్పించడం ఇప్పుడు పెద్ద టాస్క్ అయిపోయింది. సినిమాలో బీభత్సమైన కంటెంట్ ఉంటే తప్ప థియేటర్ వరకు రావడం లేదు. లేదా అది చాలా పెద్ద హీరో సినిమా అయ్యి ఉండాలి. లేదంటే ఇంకా ఆ సినిమాను ఓటిటి లో చూడొచ్చులే అని వదిలేస్తున్నారు.

  • Published Dec 11, 2025 | 10:47 AMUpdated Dec 11, 2025 | 10:47 AM
మోగ్లీ టీం కొత్త టెక్నీక్.. రూ.99ల‌కే !

ప్రేక్షకులను థియేటర్స్ వరకు రప్పించడం ఇప్పుడు పెద్ద టాస్క్ అయిపోయింది. సినిమాలో బీభత్సమైన కంటెంట్ ఉంటే తప్ప థియేటర్ వరకు రావడం లేదు. లేదా అది చాలా పెద్ద హీరో సినిమా అయ్యి ఉండాలి. లేదంటే ఇంకా ఆ సినిమాను ఓటిటి లో చూడొచ్చులే అని వదిలేస్తున్నారు. ఇదిలా ఉంటె టికెట్స్ రేట్స్ పెరగడం వలన కూడా ప్రేక్షకులు థియేటర్స్ కు రావడం లేదని ఓ వర్గం వారి నుంచి బలంగా వినిపిస్తున్న మాటలు. ఈ మాత్రం వినోదానికి ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే ఎలా అని మరో వైపు నిర్మాతల వాదన. ఏదేమైనా చివరికి ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించడమే అసలైన టాస్క్.

అయితే ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని కొంతమంది నిర్మాతలు టికెట్ రేట్స్ ను తగ్గించి రిలీజ్ చేస్తున్నారు. ఆమ‌ధ్య విడుద‌లైన `రాజు వెడ్స్ రాంబాయి` సినిమా టికెట్ ని రూ.99 ల‌కే అందుబాటులోకి తీసుకుని వచ్చారు. అది ఎంతో కొంత వర్కౌట్ అయినట్టే అనిపించింది. దీనితో ఇప్పుడు మోగ్లీ మూవీ టీం కూడా ఇదే ఫాలో అవ్వాలని అనుకుంటున్నారట. ఈ నెల 13న ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా టికెట్ రేట్ ను రూ. 99 కె అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు.

ఈ సినిమా ఏమి మరీ అంత చిన్న సినిమా కాదు. దీనికోసం నిర్మాతలు బాగానే ఖర్చు చేశారు. అలాంటిది దీనిని కేవలం రూ. 99 కే అందుబాటులోకి తీసుకునిరావాలి అనుకోవడం ఆలోచించాల్సిన విషయమే. ఒకవేళ ఈ స్కీం కు ప్రేక్షకులు అట్ట్రాక్ట్ అయితే బానే ఉంటుంది. లేదంటే మూవీ టీం రిస్క్ చేస్తున్నట్లే. ఇంత తగ్గించినా కూడా జనం థియేటర్స్ కు రావడం లేదంటే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయేమో చేసుకోవాల్సిందే . ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.