iDreamPost
android-app
ios-app

షాక్ మీద షాక్ ఇస్తున్న OTT సంస్థలు

  • Published Dec 06, 2025 | 6:10 PM Updated Updated Dec 06, 2025 | 6:10 PM

కరోనా సమయం నుంచి ఓటిటి ల హావ పెరిగిన సంగతి తెలిసిందే. తర్వాత తర్వాత ఓటిటి లు కూడా అడ్వాన్స్ అయ్యి సినిమా రిలీజ్ కు ముందే కోట్లు గుమ్మరించి మరీ డిజిటల్ హక్కులను కొనుక్కుంటున్నాయి. థియేటర్లో సినిమా రిలీజ్ అయినా నెల రోజుల తర్వాత ఓటిటి లో స్ట్రీమింగ్ అయ్యేలా ముందే డీల్ మాట్లాడుకుంటున్నాయి. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ తర్వాత తర్వాత అంతా మారిపోయింది.

కరోనా సమయం నుంచి ఓటిటి ల హావ పెరిగిన సంగతి తెలిసిందే. తర్వాత తర్వాత ఓటిటి లు కూడా అడ్వాన్స్ అయ్యి సినిమా రిలీజ్ కు ముందే కోట్లు గుమ్మరించి మరీ డిజిటల్ హక్కులను కొనుక్కుంటున్నాయి. థియేటర్లో సినిమా రిలీజ్ అయినా నెల రోజుల తర్వాత ఓటిటి లో స్ట్రీమింగ్ అయ్యేలా ముందే డీల్ మాట్లాడుకుంటున్నాయి. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ తర్వాత తర్వాత అంతా మారిపోయింది.

  • Published Dec 06, 2025 | 6:10 PMUpdated Dec 06, 2025 | 6:10 PM
షాక్ మీద షాక్ ఇస్తున్న OTT సంస్థలు

కరోనా సమయం నుంచి ఓటిటి ల హావ పెరిగిన సంగతి తెలిసిందే. తర్వాత తర్వాత ఓటిటి లు కూడా అడ్వాన్స్ అయ్యి సినిమా రిలీజ్ కు ముందే కోట్లు గుమ్మరించి మరీ డిజిటల్ హక్కులను కొనుక్కుంటున్నాయి. థియేటర్లో సినిమా రిలీజ్ అయినా నెల రోజుల తర్వాత ఓటిటి లో స్ట్రీమింగ్ అయ్యేలా ముందే డీల్ మాట్లాడుకుంటున్నాయి. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ తర్వాత తర్వాత అంతా మారిపోయింది. కండిషన్స్ మీద కండిషన్స్ పెడుతూ.. తాము చెప్పిన డేట్ కే సినిమా రిలీజ్ చేయాలంటూ.. నిర్మాతలను టెన్షన్ పెట్టేస్తున్నాయి. ఒకప్పుడు థియేట్రికల్ రన్ ఎలా ఉన్నా.. డిజిటల్ రైట్స్ తో సేఫ్ అయ్యేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు.

అప్పట్లో రిలీజ్ కు ముందే ఓటిటి డీల్ కంప్లీట్ చేసుకున్న సంస్థలు.. ఇప్పుడు అది థియేట్రికల్ రన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందనే మెలిక పెట్టారు. ఏదైనా ఓ సినిమాకు ఓటిటి ఓ రేటు ఫిక్స్ చేసుకున్న తర్వాత.. ఆ సినిమా థియేట్రికల్ గా రిలీజ్ అయ్యి సక్సెస్ అయితేనే ముందుగా కుదుర్చుకున్న రేటు ఇచ్చేస్తారట. లేదంటే ఆ డీల్ లో 25% కోత ఉంటుందని అంటున్నారట. ఇలాంటి కండిషన్స్ తో నే అగ్రిమెంట్స్ జరుగుతున్నాయట. సో నిర్మాతలకు ఇది భారీ షాక్ అని చెప్పి తీరాల్సిందే.

ఎందుకంటే ఇప్పుడు ప్రేక్షకులు సినిమాలను ఆదరించే తీరు మారిపోయింది. ఓ సినిమా థియేటర్లో వేసినప్పుడు వచ్చే రెస్పాన్స్ కంటే కూడా ఓటిటి లో వేసినప్పుడు వచ్చే రెస్పాన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. దాదాపు ఓటిటి ల లోనే కొన్ని సినిమాలను చూడడానికి ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. ఈ లెక్కన ఇది నిర్మాతలకు కాస్త నష్టం కలిగించే విషయమే అని చెప్పి తీరాల్సిందే. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.