iDreamPost
android-app
ios-app

మన శంకర వరప్రసాద్ గారి నుంచి అసలైన కంటెంట్ ఇంకెప్పుడో !

  • Published Dec 11, 2025 | 1:03 PM Updated Updated Dec 11, 2025 | 1:03 PM

ఈ సంక్రాంతికి సందడి అంతా మన శంకర వరప్రసాద్ గారిదే అయ్యేలా ఉంది. ఈ సినిమాకు సంబంధించి వస్తున్న ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతుంది. సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది. మూవీ టీం వీలైనంత త్వరగా ప్రమోషన్స్ మొదలుపెట్టాల్సి ఉంది.

  • Published Dec 11, 2025 | 1:03 PMUpdated Dec 11, 2025 | 1:03 PM
మన శంకర వరప్రసాద్ గారి నుంచి అసలైన కంటెంట్ ఇంకెప్పుడో !

ఈ సంక్రాంతికి సందడి అంతా మన శంకర వరప్రసాద్ గారిదే అయ్యేలా ఉంది. ఈ సినిమాకు సంబంధించి వస్తున్న ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతుంది. సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది. మూవీ టీం వీలైనంత త్వరగా ప్రమోషన్స్ మొదలుపెట్టాల్సి ఉంది. అది కాకుండా ఇంతవరకు అసలైన కంటెంట్ ఏది కూడా ఇంకా బయటకు రాలేదు. కనీసం టీజర్ కూడా ఇంకా రాలేదు.

దీనితో ఇలా పాటలతో సరిపెట్టకుండా టీజర్ ట్రైలర్ లాంటివి రిలీజ్ చేస్తే బావుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అనిల్ రావిపూడి అందరి హీరోలతో వెరైటీ గానే చేస్తూ ఉంటాడు. అలాంటిది చిరంజీవి లాంటి పెద్ద హీరోని పెట్టుకుని ఎలాంటి ప్రమోషన్స్ చేయబోతున్నాడా అనే క్యూరియాసిటీ కొందరిలో ఉంది. అలాగే సినిమాలో చిరుని ఎలా చూపించాడో అనే ఆలోచన కూడా ఓ వైపు ఉంది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే అసలైన కంటెంట్ బయటకు రావాల్సిందే. ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.