Swetha
ఇక 2025 కు గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చేసింది. టాలీవుడ్ లో ఈ ఏడాది ఎన్ని ప్లాపులు , ఎన్ని హిట్స్ అనే లెక్కలు వేయడం మొదలుపెట్టేసారు. ఈ ఏడాదికి గ్రాండ్ గా సాగనంపేందుకు అఖండ 2 వచ్చేసింది. ప్రస్తుతం బాలకృష్ణ ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమా ఇస్తున్న హై లో ఉన్నారు. ఈ ఏడాది హిట్ లు కొట్టిన హీరోలకంటే ప్లాపులు ఎదుర్కున్న హీరోలే ఎక్కువ ఉన్నారు. వా
ఇక 2025 కు గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చేసింది. టాలీవుడ్ లో ఈ ఏడాది ఎన్ని ప్లాపులు , ఎన్ని హిట్స్ అనే లెక్కలు వేయడం మొదలుపెట్టేసారు. ఈ ఏడాదికి గ్రాండ్ గా సాగనంపేందుకు అఖండ 2 వచ్చేసింది. ప్రస్తుతం బాలకృష్ణ ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమా ఇస్తున్న హై లో ఉన్నారు. ఈ ఏడాది హిట్ లు కొట్టిన హీరోలకంటే ప్లాపులు ఎదుర్కున్న హీరోలే ఎక్కువ ఉన్నారు. వా
Swetha
ఇక 2025 కు గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చేసింది. టాలీవుడ్ లో ఈ ఏడాది ఎన్ని ప్లాపులు , ఎన్ని హిట్స్ అనే లెక్కలు వేయడం మొదలుపెట్టేసారు. ఈ ఏడాదికి గ్రాండ్ గా సాగనంపేందుకు అఖండ 2 వచ్చేసింది. ప్రస్తుతం బాలకృష్ణ ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమా ఇస్తున్న హై లో ఉన్నారు. ఈ ఏడాది హిట్ లు కొట్టిన హీరోలకంటే ప్లాపులు ఎదుర్కున్న హీరోలే ఎక్కువ ఉన్నారు. వారు ఎవరో ఆ కథలేంటో తెలియనిది కాదు. ఓవరాల్ గా అయితే టాలీవుడ్ సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకులను నిరాశ పరిచయాని చెప్పాల్సిందే. పైగా ఈ స్టార్ హీరోల నుంచి ఒక్క సినిమా కూడా రాకపోవడం కాస్త వెలితిగా ఉందని చెప్పాల్సిందే.
అలా అని వాళ్ళు కాళిగా ఉన్నారని కాదు. షూట్స్ లో బిజీ బిజిగానే ఉన్నారు. మెగాస్టార్ నుంచి ఈ ఏడాది విశ్వంభర రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వలన అది పోస్ట్ పోన్ అయినసంగతి తెలిసిందే. ఇది కాకుండా ఆయన మాన్ శంకర వరప్రసాద్ గారితో బిజీగా ఉన్నారు. ఇది సంక్రాంతికి వచ్చేస్తుంది. ఆ తర్వాత విశ్వంభర వస్తుంది. సో చిరు నుంచి 2026 లో డబుల్ బొనాంజా అని చెప్పొచ్చు. తర్వాత శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా , బాబీ దర్శకత్వంలో మరో సినిమా తీసే ప్లాన్ లో ఉన్నారట చిరు. ఇక మహేష్ నుంచి 2024 సంక్రాంతిలో గుంటూరు కారం సినిమా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మహేష్ ను తెర మీద చూసేది 2027 లోనే.
ఈ గ్యాప్ లో మహేష్ ఎవరితో బిజీగా ఉన్నాడో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మహేష్ కోసం సందీప్ రెడ్డి వంగ ఓ కథను సిద్ధం చేశాడట . ఈ వారణాసి రిలీజ్ తర్వాత ఆ అప్డేట్స్ రావొచ్చు. ఇక అల్లు అర్జున్ విషయానికొస్తే గత ఏడాదికి పుష్ప 2 కు భారీ గ్రాండ్ ఫెర్వేల్ ఇచ్చి సైలెంట్ అయిపోయాడు . ప్రస్తుతం అట్లీ తో బిజీగా ఉన్నాడు . 2026 లో ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ రాజాసాబ్ కూడా ఈ ఏడాది రిలీజ్ కావల్సి ఉంది కానీ .. అది కూడా 2026 లోనే రిలీజ్ అవుతుంది. అట్లీ తరవాత బోయపాటి శ్రీనుతో బన్నీ ఓ సినిమా చేస్తాడని టాక్. ఎన్టీఆర్ దేవర తర్వాత డ్రాగన్ తో బిజీగా ఉన్నాడు ఇది కూడా 2026 లోనే వస్తుంది. సో మొత్తానికి 2026 లో టాలీవుడ్ కు మంచి కానుకలు ఇస్తుందని చెప్పొచ్చు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.