Akhanda 2 Movie Review in Telugu : గతవారం రిలీజ్ అవ్వాల్సిన బాలకృష్ణ బోయపాటి మ్యాజిక్ అఖండ 2 .. ఆటంకాలు అన్నీ దాటుకుని ఈరోజు రిలీజ్ అయింది. ముందు నుంచే సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయం రివ్యూలో చూసేద్దాం .
Akhanda 2 Movie Review in Telugu : గతవారం రిలీజ్ అవ్వాల్సిన బాలకృష్ణ బోయపాటి మ్యాజిక్ అఖండ 2 .. ఆటంకాలు అన్నీ దాటుకుని ఈరోజు రిలీజ్ అయింది. ముందు నుంచే సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయం రివ్యూలో చూసేద్దాం .
Swetha
చాలా సస్పెన్స్ తర్వాత బాలకృష్ణ అభిమానుల ఆశలు నెరవేరాయి. ఎప్పుడెప్పుడు బోయపాటి మ్యాజిక్ చూద్దామా అని అనుకున్న వారంతా ఫుల్ ఖుషిలో ఉన్నారు . గతవారం రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఆటంకాలు అన్నీ దాటుకుని ఈరోజు రిలీజ్ అయింది. ముందు నుంచే సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు ఆ సిక్వెల్ కు రాని విధంగా ఈ సినిమాకు రెస్పాన్స్ వస్తుందని హైప్ క్రియేట్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయం రివ్యూలో చూసేద్దాం .
కథ :
అఖండ మొదటిభాగం ఎక్కడైతే ఆగిపోయిందో., రెండో భాగం అక్కడినుంచే మొదలుపెట్టారు. ఆ ముగిసిన కథకు సుమారు పద్దెమిదేళ్ళ తర్వాత ఈ సినిమా మొదలవుతుంది. ఊరిలో ఉండే అఖండ తమ్ముడు ( బాలకృష్ణ) కూతురు హర్షాలీ మల్హోత్రా డీఆర్డిఓ లో ట్రైనీగా పనిచేస్తుంది. మరో వైపు కుంభమేళ జరుగుతూ ఉంటుంది. ఆ కుంభమేళాలలో కొంతమంది ఓ వైరస్ ను స్ప్రెడ్ చేస్తారు. తానూ కనిపెట్టిన ఓ వ్యాక్సిన్ తో ఆ వైరస్ ను కట్టడి చేయాలనీ అనుకుంటుంది హర్షాలీ. ఈ క్రమంలో ఆమె ఆపదలో పడుతుంది. ఈ విషయం అఖండ కు తెలుస్తుంది. ఎలా అయినా ఆమెను , ఆమెతో పాటు దేశాన్ని కాపాడాలని అనుకుంటాడు అఖండ. అసలు ఆ వైరస్ స్ప్రెడ్ చేసింది ఎవరు ? అఖండ ఎలా వారికి బుద్ధి చెప్తాడు ? ఆదిపినిశెట్టి పాత్ర ఏంటి ? ఇవన్నీ తెలియాలంటే వెండితెరమీద ఈ సినిమా చూడాల్సిందే.
నటీ నటులు టెక్నీకల్ టీం పని తీరు :
బాలకృష్ణ నట విశ్వ రూపం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డ్యూయల్ రోల్ లో బాలకృష్ణ తన పాత్రకు తగినట్టు ఒదిగిపోయారు. ముఖ్యంగా అఖండ పాత్రలో తాండవం చేశారు బాలయ్య. ఈ క్యారెక్టర్ చూస్తున్నంత సేపు గూస్బంప్స్ పక్కా. ఎంటైర్ బాలకృష్ణ కెరీర్ లో ఇది గుర్తుండిపోయే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాలయ్య స్క్రీన్ మీద కనిపించినంతసేపు ఇక మిగిలిన ఎవరు కూడా కళ్ళకు ఆనరని చెప్పి తీరాల్సిందే. శివుడు పాత్రలో నటించిన వ్యక్తి ఎవరో తెలియదు కానీ అతను కూడా చాలా అద్భుతంగా నటించాడని చెప్పాల్సిందే. ఇక మిగిలిన నటీ నటులంతా కూడా తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. మొత్తం మీద బాలకృష్ణ అందరిని డామినేట్ చేసాడని చెప్పొచ్చు.
ఇక టెక్నీకల్ టీం విషయానికొస్తే.. సినిమాలో బాలకృష్ణ ఎంత హైలెట్ అయ్యాడో ఆ తర్వాత హైలెట్ అయింది మూవీలోని విజువల్స్ ఏ. ఒక్కో షాట్ చూసేవారికి ఫుల్ హై ఇచ్చింది. దానికి తోడు తమన్ కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్యూర్ గూస్బంప్స్ ను కలిగించింది. టెక్నీకల్ టీం విషయంలో హీరో తమన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఆ తర్వాత హైలెట్ గా నిలిచింది మూవీలోని డైలాగ్స్. సినిమాలోని ప్రతి డైలాగ్ మంచి హై ఇచ్చిందని చెప్పొచ్చు. ఆర్ట్ డిపార్ట్మెంట్ పని తీరు చాలా క్లియర్ గా కనిపించింది . లొకేషన్స్ , విజువల్స్ అన్నీ బాగా సెట్ అయ్యాయి. ఓవరాల్ గా సినిమా సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం టెక్నీకల్ టీం కూడా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు
విశ్లేషణ :
ప్యూర్ బోయపాటి బాలయ్య కాంబో ఇది . ఇదే కథకు దర్శకుడు మారినా లేదా హీరో మారినా అసలు సినిమా చూడాలనిపించేది కాదేమో. ఆ రేంజ్ లో ఇద్దరు ప్రేక్షకుల మైండ్ లో ప్రింట్ వేసేసారు. సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేసాడు బోయపాటి. ఇక బాలకృష్ణ బోయపాటి కాంబో అంటే అక్కడ లాజిక్స్ తో సంబంధం లేదు. ఓన్లీ మ్యాజిక్ అన్నట్టు తెర మీద కనిపిస్తున్న దానికి విజిల్స్ వేసుకుంటూ కూర్చోడమే. ఇక్కడ అఖండ 2 విషయంలో కూడా ఇదే జరిగింది. బిగినింగ్ నుండి సినిమా ఎండ్ వరకు చాలా చోట్ల లాజిక్ మిస్ అయ్యాడు బోయపాటి. స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు ఎంగేజింగ్ గా ఉంచే ఇంట్రెస్టింగ్ సీన్స్ ఏమి పడలేదు. కేవలం అదంతా నెక్స్ట్ సిక్వెన్స్ కు గ్యాప్ ఫిల్లింగ్ వాడుకున్నారేమో అనే ఫీలింగ్ కలుగుతుంది.
ఎప్పుడైతే అఖండ ఎంట్రీ ఇస్తాడో అప్పుడు ప్రేక్షకులలో కాస్త ఉత్సాహం కనిపిస్తుంది. ప్రీ ఇంటర్వెల్ ఫైట్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఎలాంటి లాజిక్స్ ఆలోచించకుండా సినిమా చూస్తే.. ప్రేక్షకులలో కొంచెం శాటిస్ఫ్యాక్షన్ ఉంటుంది. సెకండ్ ఆఫ్ స్టార్ట్ అయినా దగ్గరనుంచి సినిమాలో ఎదో కాస్త కథ ఉన్నట్టు అర్ధమౌతుంది. అలా చూస్తూ చూస్తూ క్లైమాక్స్ చేరుకునేపాటికి కథ కంటే కూడా ప్యూర్ బాలయ్య స్టఫ్ ఇది అనే క్లారిటీ వస్తుంది. కొన్ని డివోషనల్ ఎలిమెంట్స్ తో పాటు బాలయ్య వినూత్నమైన ఫైట్స్ తో సినిమాను కంప్లీట్ చేశారు.
కథ లేకపోయినా ఎలివేషన్స్ తో సినిమా కంప్లీట్ చేయొచ్చని .. ఇలా కూడా ప్రేక్షకులని మెప్పించొచ్చని బోయపాటి నిరూపించి చూపించాడు. ఈ రకంగా బోయపాటి దాదాపు సక్సెస్ అయినట్టే. రెగ్యులర్ మూవీ లవర్స్ కు సినిమా క్రిటిక్స్ కు ఈ సినిమా నచ్చకపోవచ్చు కానీ బాలకృష్ణ అభిమానులకు మాత్రం పక్కాగా నచ్చే సినిమా ఇది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే స్టఫ్ బాగనే ఉంది. ఒకవేళ క్లిక్ అయితే మాత్రం భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశం లేకపోలేదు. ఇక ముందు ముందు ఏమౌతుందో చూడాలి.
ప్లస్ లు :
మైనస్ లు :
రేటింగ్ : 2.5/5
చివరిగా : నో లాజిక్స్ ఓన్లీ బోయపాటి, బాలకృష్ణ మ్యాజిక్ అఖండ 2