iDreamPost
android-app
ios-app

బోణి బాగానే ఉంది కానీ అసలు కథ ముందుంది..

  • Published Dec 13, 2025 | 3:18 PM Updated Updated Dec 13, 2025 | 3:18 PM

ఈ మధ్య కాలంలో ఓ సినిమా మహా అయితే మొదటి వీకెండ్ వరకు మాత్రమే ఆడుతుంది. ఆ తర్వాత థియేటర్లో సీట్లు నిండడం కాస్త కష్టతరంగానే ఉంటుంది. ఇప్పుడు బాలయ్య సినిమాకు కూడా ఈ టెన్షన్ తప్పేలా లేదు. అసలే సినిమా లేట్ గా వచ్చింది. అయినాసరే ఎక్కడా కూడా నెగిటివిటి రాలేదు. ఒక వీక్ ఆలస్యంగా వచ్చినా కానీ ప్రీమియర్స్ కు బాగానే టికెట్స్ బుక్ అయ్యాయి.

  • Published Dec 13, 2025 | 3:18 PMUpdated Dec 13, 2025 | 3:18 PM
బోణి బాగానే ఉంది కానీ అసలు కథ ముందుంది..

ఈ మధ్య కాలంలో ఓ సినిమా మహా అయితే మొదటి వీకెండ్ వరకు మాత్రమే ఆడుతుంది. ఆ తర్వాత థియేటర్లో సీట్లు నిండడం కాస్త కష్టతరంగానే ఉంటుంది. ఇప్పుడు బాలయ్య సినిమాకు కూడా ఈ టెన్షన్ తప్పేలా లేదు. అసలే సినిమా లేట్ గా వచ్చింది. అయినాసరే ఎక్కడా కూడా నెగిటివిటి రాలేదు. ఒక వీక్ ఆలస్యంగా వచ్చినా కానీ ప్రీమియర్స్ కు బాగానే టికెట్స్ బుక్ అయ్యాయి. మొదటి రోజే దగ్గర దగ్గర 50 కోట్ల వరకు గ్రాస్ వచ్చిందనే టాక్ నడుస్తుంది. అఫీషియల్ అప్డేట్స్ అయితే ఇంకా ఏమి రాలేదు. సినిమా టాక్ తో సంబంధం లేకుండా టికెట్స్ అయితే బుక్ అయిపోతున్నాయి.

అయితే ప్రస్తుతం సిక్వెల్స్ కు ఉన్న క్రేజ్ కోణంలో చూస్తే మాత్రం ఈ నెంబర్స్ కాస్త తక్కువే అని చెప్పొచ్చు. కాకపోతే వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు పెరిగే అవకాశం లేకపోలేదు. అలా జరగాలి అంటే కచ్చితంగా ఈరోజు రేపు పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వాల్సిందే . ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం కాస్త నెగిటివ్ రివ్యూస్ కూడా వస్తున్నాయి . అఖండ1 చూసిన కళ్ళతో అఖండ 2 మీద భారీ అంచనాలు పెట్టుకున్న కామన్ ఆడియన్స్ మాత్రం .. పూర్తిగా శాటిస్ఫై అవ్వలేదని చెప్పాల్సిందే. కాకపోతే అభిమానులు మాత్రం రివ్యూ లు , రికార్డులు , లాజిక్ లతో సంబంధం లేకుండా సినిమా చూసేందుకు పోటీపడుతున్నారు.

ఈ వీకెండ్ దాటినా తర్వాత కూడా అఖండ 2 కనుక సాలిడ్ కలెక్షన్స్ రాబడితే.. అప్పటికి రికవరీలో సగం వరకు కంప్లీట్ అవ్వొచ్చు. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మాత్రం కనీసం రెండు మూడు వారాల రన్ కావాలి. బ్రాండ్ కు ఉన్న ఇమేజ్ కారణంగా ఇంత హైప్ రావడం బాగానే ఉంది . కానీ ఆ రేంజ్ కలెక్షన్స్ అందుకోవాలంటే మాత్రం కాస్త కష్టపడక తప్పదు. పోటీలో చెప్పుకోదగిన సినిమాలు ఏమి లేవు కాబట్టి.. ముందు ముందు ఎలాంటి హైప్ వస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.