Swetha
ఏదైనా పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్స్ దగ్గర ఆ సందడే వేరు. కానీ ఈ ఏడాది మాత్రం రిలీజ్ ముందు వరకు ప్రేక్షకులలో ఉన్నంత జోష్ రిలీజ్ తర్వాత అంతగా కనిపించకకుండా పోయింది. చాలా సినిమాల విషయాల్లో ఇలా జరిగింది. అనుకున్నది ఒకటి అయింది మరొకటి అన్నట్టు అంచనాలు తారు మారు అయ్యాయి.
ఏదైనా పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్స్ దగ్గర ఆ సందడే వేరు. కానీ ఈ ఏడాది మాత్రం రిలీజ్ ముందు వరకు ప్రేక్షకులలో ఉన్నంత జోష్ రిలీజ్ తర్వాత అంతగా కనిపించకకుండా పోయింది. చాలా సినిమాల విషయాల్లో ఇలా జరిగింది. అనుకున్నది ఒకటి అయింది మరొకటి అన్నట్టు అంచనాలు తారు మారు అయ్యాయి.
Swetha
ఏదైనా పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్స్ దగ్గర ఆ సందడే వేరు. కానీ ఈ ఏడాది మాత్రం రిలీజ్ ముందు వరకు ప్రేక్షకులలో ఉన్నంత జోష్ రిలీజ్ తర్వాత అంతగా కనిపించకకుండా పోయింది. చాలా సినిమాల విషయాల్లో ఇలా జరిగింది. అనుకున్నది ఒకటి అయింది మరొకటి అన్నట్టు అంచనాలు తారు మారు అయ్యాయి. సంక్రాంతి సీజన్ తర్వాత మళ్ళీ థియేటర్స్ లో సందడి కనిపించింది కుభేర సినిమాకే. ఆ తర్వాత పెద్ద పండగల చేసుకుంది పవన్ కళ్యాణ్ సినిమాకే. ఇక ఇప్పుడు 2025 కంప్లీట్ అయిపోతుంది.
బోయపాటి బాలకృష్ణ సినిమాతో మంచి ఫెర్వేల్ ఇస్తారని అంతా ఆశించారు. కానీ మునుపెన్నడూ లేని విధంగా సినిమా రిలీజ్ రోజు పోస్ట్ పోన్ అయింది. దాని వెనుక ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనేది అందరికి తెలిసిందే. చాలా ఆలస్యం అవుతుందని అనుకున్నారు కానీ.. కేవలం ఓ వారం గ్యాప్ లోనే మూవీ వచ్చేస్తుంది. ఇంకొద్ది గంటల్లో తెర మీద బాలయ్య తాండవం కనిపించబోతుంది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
ఇవన్నీ చూస్తుంటే మాస్ ఎలివేషన్స్ కు సినిమాలో డోకా లేదని తెలిసిపోతుంది. ఎక్కడో కొన్నిసీన్స్ ఓవర్ బోర్డు అయ్యాయని అనుకుంటున్నారు.. కానీ అది బాలయ్య చేస్తే బానే ఉంటుందని కూడా అనుకుంటున్నారు. సినిమా లేట్ అయింది కదా అని దాని మీద ఏక్కడా కూడా నెగిటివ్ ఇంపాక్ట్ కనిపించడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకుపోతుంది . తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ రెస్పాన్స్ వస్తుంది. సో సినిమాకు పక్కాగా భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయని చెప్పాల్సిందే.
ఇక సినిమాకు పాజిటివ్ టాక్ రావడమే బ్యాలన్స్ . అయితే ఇప్పటివరకు బోయపాటి మీద అంత ప్రెజర్ ఏమి లేదు కానీ ఈసారి ఇది పాన్ ఇండియా మూవీ.. ఊహించని బ్రేక్ తర్వాత వస్తుంది. సో ఎట్టిపరిస్థితిలో సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. సో ఇక ఏమి జరుగుతుందో చూడాలి. ఇంకొద్ది గంటల్లో రిజల్ట్ ఏంటి అనేది తెలిసిపోతుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.