ఇండియా – సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న అయిదు మ్యాచ్ ల T20 సిరీస్ లో ఇప్పటికే భారత్ రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. సిరీస్ గెలవాలంటే కచ్చితంగా మిగిలిన మూడు మ్యాచ్ లు గెలిచి తీరాల్సిందే. దీంతో భారత టీంపై మరింత ఒత్తిడి పెరిగింది. నేడు(జూన్ 14) విశాఖలో ఇండియా-సౌత్ ఆఫ్రికా మధ్య మూడవ T20 మ్యాచ్ జరగనుంది. ఇప్పిటికే రెండు జట్లు విశాఖ చేరుకున్నాయి. మ్యాచ్ చూసేందుకు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు క్రికెట్ అభిమానులు. దాదాపు […]
విలాసవంతమైన నౌక కార్డీలియా క్రూయిజ్‌కు పుదుచ్చేరి ప్రభుత్వం బ్రేక్ వేసింది. విశాఖపట్నం నుంచి బయల్దేరిన కార్డీలియో క్రూయిజ్‌ను తమ రాష్ట్రంలోకి అనుమతించేది లేదని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) చెప్పారు. టూరిజంను అభివృద్ధి చేయాలనే ఆసక్తితో ఉన్నా, మన సంస్కృతికి విరుద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోబోమని తమిళిసై స్పష్టం చేశారు. దీంతో తెల్లవారుజామున 4 గంటల నుంచి సముద్రంలోనే షిప్ ఉండిపోయింది. పుదుచ్చేరి అధికారులు కూడా ఈ క్రూయిజ్ గురించి సమాచారం అందలేదని అంటున్నారు. క్రూయిజ్‌లో కేసీనో, […]
విశాఖపట్టణం ఎయిర్ పోర్ట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ప్రియుడు కృష్ణ (19), ప్రియురాలు నేహా (17) వీరిద్దరూ పాయిజన్ తీసుకున్నారు. ప్రియురాలు నేహా మాత్రం అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. మైనర్ బాలిక కావడం గమనార్హం. ఇక ప్రియుడి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రియురాలు మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం […]
రెండునెలలకు పైగా టైం ఉండగానే బ్రహ్మాస్త్ర టీమ్ ప్రమోషన్ల వేగం పెంచింది. తెలుగు రాష్ట్రాలను టార్గెట్ చేసుకుని వైజాగ్ నుంచి మొదలుపెట్టడం విశేషం. ఇవాళ అక్కడ జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో హీరో రన్వీర్ కపూర్, దర్శకుడు అయాన్ ముఖర్జీలతో పాటు తెలుగు వెర్షన్ సమర్పకులు రాజమౌళి హాజరు కావడం విశేషం. డేట్ సమస్య వల్ల హీరోయిన్ అలియా భట్ రాలేకపోయింది. అభిమానులతో కిక్కిరిసిపోయిన ఆడిటోరియంలో ఈ సినిమాకు సంబంధించిన పలు విశేషాలను షేర్ చేసుకోవడంతో పాటు […]
రాష్ట్రంలో సొంతిల్లు లేని కుటుంబం ఉండబోదని ఇచ్చిన మాట ప్రకారం మెరుగైన సౌకర్యాలతో ఇళ్లు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. నవరత్నాల్లో భాగంగా.. సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం లే అవుట్లో నిర్మించిన మోడల్ హౌస్‌ను సీఎం జగన్ పరిశీలించారు. అనంతరం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని.. బహిరంగసభలో ప్రసంగించారు. ‘‘ఇళ్లు అనేది ఒక శాశ్వత చిరునామా. తర్వాతి తరానికి ఇచ్చే ఆస్తి. అలాంటి ఇళ్లను ఇవ్వడం ద్వారా ఒక సామాజిక […]
ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహణ రాజధానిగా మారబోతున్న విశాఖలో రెవెన్యూ అధికారులు జూలు విదుల్చుతున్నారు. కబ్జాలపై కొరడా ఝులిపిస్తున్నారు. గతంలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను గుర్తిస్తూ.. వాటిని స్వాధీనం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. బడా నేతలు, ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, బినామాల పేరుతో, అనుచరుల పేరుతో విశాఖ చుట్టుపక్కలా భూ కబ్జాలకు పాల్పడినట్లు ఇప్పటికే రెవెన్యూ అధికారులు గుర్తించారు. వాటిని పక్కా ఆధారాలతో గుర్తించి ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, […]
ఏపీలో రాజకీయాలు భలే గమ్మత్తుగా ఉంటున్నాయి. ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో విఫలమైతే ప్రతిపక్షం రోడ్డెక్కుతుంది. ధర్నాలు, ఆందోళనలతో హడావిడి చేస్తుంది. ఏ రాష్ట్రంలోనైనా అదే జరిగేది. కానీ ఇక్కడ ప్రతిపక్షం పాత్ర.. పాత్రకు తగ్గట్లుగా ఉండడం లేదని విమర్శల పాలవుతోంది. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అయితే దాన్నో పాఠంగా ఎక్కడ సమావేశం జరిగినా వల్లె వేస్తుంటారు. ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా తామే ప్రతిపక్షమని ధైర్యంగా ప్రకటిస్తారు కూడా. అందుకు కారణం టీడీపీ అనుసరిస్తున్న […]
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాయకుల మధ్య ప్రమాణాల రాజకీయం నడుస్తోంది. పరస్పర అవినీతి ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్న నేతలు ప్రమాణాలు చేయాలనే సవాళ్లను విసురుతున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మధ్య ప్రమణాల రాజకీయం ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీయగా.. తాజాగా విశాఖపట్నంలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ విశాఖలో భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఎంపీ విజయసాయి రెడ్డి, […]
కార్యానిర్వాహక రాజధానిగా నిర్ణయించిన విశాఖకు మద్ధతుగా రేపు శుక్రవారం సాగరతీరంలో భారీ ర్యాలీ జరగనుంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించతలపెట్టారు. శుక్రవారం ఉదయం 6:30 గంటలకు విశాఖ ఆర్కే బీచ్‌లో ఈ ర్యాలీ జరగనుంది. వివిధ ప్రజా, విద్యార్థి, స్వచ్ఛంద సంఘాలు ఈ ర్యాలీలో భాగస్వాములు అయ్యేందుకు ఆసక్తిగా ఉన్నాయి. ర్యాలీలో పాల్గొనాలని ఆయా సంఘాలు విస్తృత ప్రచార సాగిస్తున్నాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విశాఖతో సాధ్యమనే నినాదంతో ఈ […]
సంఘటన జరగడం సహజం. కానీ చక్కదిద్దడం, బాధితులను ఆదుకోవడం సర్కారు చేతుల్లో ఉంటుంది. వీలయినంత వేగంగా స్పందించి, నష్టపోయిన వారికి పరిహారం అందిస్తే కలిగే ఊరట అంతా ఇంతా కాదు. అందుకే ఏపీలో జగన్ ప్రభుత్వం ఈ విషయంలో పగడ్బందీగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. గతంలో అనేక సందర్భాల్లో నష్టపరిహారం ప్రకటించడం, దానికోసం కాళ్లరిగేలా బాధితులు తిరగడం చాలా మందికి తెలిసిందే. చివరకు పుష్కరాల సందర్భంలో నాటి ప్రభుత్వ పెద్దల నిర్వాహకంతో మూడు పదుల మంది ప్రాణాలు కోల్పోతే […]