nagidream
హైదరాబాద్ సిటీలో 2 బీహెచ్కే ఫ్లాట్ రేటు 70, 80 లక్షలు పైనే ఉంది. 1 బీహెచ్కే ఫ్లాట్ అయితే దొరకడం కష్టం. ఒకవేళ దొరికినా గానీ 30 లక్షలకు తక్కువ లేదు. ఒకవేళ మీరు తక్కువ బడ్జెట్ లో 2 బీహెచ్కే ఫ్లాట్ పొందాలంటే ఈ ఏరియా బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
హైదరాబాద్ సిటీలో 2 బీహెచ్కే ఫ్లాట్ రేటు 70, 80 లక్షలు పైనే ఉంది. 1 బీహెచ్కే ఫ్లాట్ అయితే దొరకడం కష్టం. ఒకవేళ దొరికినా గానీ 30 లక్షలకు తక్కువ లేదు. ఒకవేళ మీరు తక్కువ బడ్జెట్ లో 2 బీహెచ్కే ఫ్లాట్ పొందాలంటే ఈ ఏరియా బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
nagidream
హైదరాబాద్ లో స్థలమే కాదు ఫ్లాట్ కొనాలన్నా గానీ కొనలేని పరిస్థితి చాలా మందిది. లక్షల్లో జీతాలు ఉండవు. ఆర్థిక పరిస్థితి కూడా పెద్దగా ఏం ఉండదు. కానీ తమ సొంత ఊర్లలో స్థలాలు కొనే పరిస్థితి కొంతమందికి ఉంటుంది. బ్యాంకు లోన్లు, చిట్టీ డబ్బులు వేసి స్థలాలు కొంటూ ఉంటారు. అయితే స్థలాలు కొనడం వల్ల ఫ్యూచర్ లో లాభమే కానీ అది ఖాళీగా ఉండడం వల్ల ప్రస్తుతానికి అయితే నష్టమే. పైగా సిటీతో పోలిస్తే పల్లెటూర్లు, పట్టణాల్లో ఇన్వెస్ట్ చేయడం అంటే దాని రేటు కూడా తక్కువే ఉంటుంది. లాభాలు కూడా తక్కువగానే ఉంటాయి. అదే సిటీలో తక్కువ ధరకు ఫ్లాట్ కొనుక్కుని రెంట్ కి ఇస్తే ఆ వచ్చిన డబ్బుతో స్థలాలు కొనుక్కోవచ్చు. లేదా మీరుండే ఇంటికి రెంట్ కట్టుకోవచ్చు. లేదా బ్యాంక్ లోన్ మీద ఫ్లాట్ కొంటే కనుక ఈఎంఐ కట్టుకోవచ్చు.
పైగా సిటీలో ఫ్లాట్ కొనడం వల్ల లాభాలు ఎక్కువగా ఉంటాయి. వైజాగ్ అనేది డెవలప్ అవుతున్న నగరం. వైజాగ్ పరిధిలో ఉన్న ఏరియాల్లో కూడా ఫ్యూచర్ లో రియల్ ఎస్టేట్ భారీగా పెరగనుంది. ఐటీ కారిడార్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీలు, ఉద్యోగ అవకాశాలు వంటివి రియల్ ఎస్టేట్ గ్రోత్ లో కీలకం కానున్నాయి. ఫ్యూచర్ లో వైజాగ్ హైదరాబాద్ రేంజ్ లో డెవలప్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని.. హైదరాబాద్ లోలా రియల్ ఎస్టేట్ ఇక్కడ కూడా భారీగా పెరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. వైజాగ్ కి అతి దగ్గర్లో ఉన్న కూర్మన్నపాలెంలో ఫ్లాట్ ధరలు తక్కువగా ఉన్నాయి. అలానే ఇక్కడ రెంటల్ ఈల్డ్ 4 శాతంగా ఉంది ఇక్కడ చదరపు అడుగు 3,300 పలుకుతుంది. 2 బీహెచ్కే ఫ్లాట్ కి యావరేజ్ గా 33 లక్షలు అవుతుంది.
1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన ఫ్లాట్ వస్తుంది. వైజాగ్ లో కాకుండా వేరే చోట ఉంటున్నవారు అయితే కనుక ఫ్లాట్ ని అద్దెకు ఇస్తే నెలకు 10 వేల నుంచి 15 వేల దాకా వస్తాయి. బ్యాంకు లోన్ ద్వారా ఫ్లాట్ తీసుకున్నా కూడా ఈఎంఐ భారం తగ్గుతుంది. ఒకవేళ చేతిలో డబ్బు ఉంటే ఫ్లాట్ కొనుక్కున్నా గానీ వేరే చోట ఎక్కడున్నా గానీ మీరు అద్దె ఇంట్లో ఉంటే ఆ అద్దె ఈ ఫ్లాట్ తీరుస్తుంటుంది. ఇక్కడ 2 బీహెచ్కే ఫ్లాట్ రెంట్ కి ఇస్తే నెలకు 8 వేల నుంచి 15 వేల వరకూ వస్తాయి. 8 వేలు, 9,500, 11 వేలు, 12 వేలు, 12,500, 14 వేలు, 15 వేలు రేంజ్ లో ఉన్నాయి. మధ్యతరగతి వ్యక్తులకు ఇది మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు.
ముఖ్యంగా హైదరాబాద్ లో ఉండే ఏపీ వారికి బెస్ట్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఇది వైజాగ్ నుంచి 7 కి.మీ. దూరంలో ఉంది. ఫ్యూచర్ లో రియల్ ఎస్టేట్ గ్రోత్ కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడున్న రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. వైజాగ్ హైదరాబాద్ రేంజ్ లో డెవలప్ అయితే కనుక హైదరాబాద్ లో ఉన్న రేట్లే వైజాగ్ లో కూడా ఉంటాయి. ఈ లెక్కన వైజాగ్ లో ఉన్న ఏరియాల్లో ఫ్లాట్ రేట్లు కూడా పెరిగిపోతాయి. ఇప్పుడు 30 లక్షలు ఉన్న ఫ్లాట్ 70, 80 లక్షలు అయిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి సామాన్య, మధ్యతరగతి వాళ్లకి ఫ్లాట్ కొనేందుకు కూర్మన్నపాలెం బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.