iDreamPost
android-app
ios-app

రాజధానిగా అమరావతి కంటే.. విశాఖపట్నం బెస్ట్..! బాలకృష్ణ చిన్నల్లుడు!

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాజధానిపై బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి కంటే విశాఖనే ఏపీ రాజధానికి అనువైన ప్రాంతం అని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాజధానిపై బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి కంటే విశాఖనే ఏపీ రాజధానికి అనువైన ప్రాంతం అని వెల్లడించారు.

రాజధానిగా అమరావతి కంటే.. విశాఖపట్నం బెస్ట్..! బాలకృష్ణ చిన్నల్లుడు!

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. మే 13న ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. ఎన్నికల ప్రచారానికి మరికొన్ని రోజులే ఉండడంతో ఆయా పార్టీల లీడర్లు ప్రజల్లో కలియతిరుగుతున్నారు. ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టేందుకు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయపార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఏపీలో రాజధాని వ్యవహారం మరోసారి చర్చలోకి వచ్చింది. టాలీవుడ్ అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ట రెండో అల్లుడు శ్రీ భరత్ ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయన రాజధానిగా అమరావతి కంటే.. విశాఖపట్నం బెస్ట్ అని చెప్పారు.

ఏపీలో రాజధాని వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా ప్రకటించారు. దీనికోసం అమరావతి రైతులు భూములను కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లో ఊహించని మార్పులు చేసుకున్నాయి. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ పార్టీ ఏపీలో అధికారాన్ని చేపట్టింది. అధికారం చేపట్టిన నాటి నుంచి సీఎం జగన్ రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతూ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తన మార్క్ పాలనను చూపించారు. దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో పథకాలను ప్రవేశపెట్టి ఏపీని ఆదర్శంగా నిలిపారు. ఈ క్రమంలో ఏపీ రాజధాని విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ఏపీకి మూడు రాజధానులను ప్రకటించారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని అక్కడి ప్రజలు ఆమోదించగా ప్రతిపక్షాలు మాత్రం అక్కసు వెల్లగక్కాయి.

అమరావతి రైతులను రెచ్చగొట్టి రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు పన్నాగం పన్నారు. అయితే ఇప్పుడు రాజధాని విషయమై గీతం విద్యాసంస్థల అధినేత శ్రీ భరత్ కీలక కామెంట్స్ చేశారు. ఏపీ రాజధానిగా అమరావతిని చేసేదానికంటే వైజాగ్ ను చేస్తేనే మరింత అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు. అమరావతిని డెవల్ చేయాలంటే సమయం ఎక్కువ పడుతుందని అన్నారు. అలాగే అమరావతిని క్యాపిటెల్ సిటీగా చేసేందుకు ఎక్కువ ఖర్చు అవుతుందన్నారు. అంత డబ్బు ఖర్చు చేసేదానికంటే అన్ని వసతులు ఉన్న వైజాగ్ ను రాజధానిగా చేయడం బెటర్ అని బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ అన్నారు. వైజాగ్ ఫ్యూచర్ లో గ్రోత్ ఉన్న ప్రాంతం.. వేల కోట్లు అమరావతిలో పెట్టడం కంటే విశాఖలో ఇన్వెస్ట్ చేస్తే ఏపీ అభివృద్ధిపథంలో దూసుకెళ్తుందని తెలిపారు. ఇక శ్రీ భరత్ గత లోక్ సభ ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన విషయం తెలిసిందే. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు విశాఖ నుంచి రెండోసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.