iDreamPost

వైజాగ్‍లో ఈ ఏరియాలో గజం స్థలం 10 వేలే.. ఇప్పుడు కొంటే భారీ లాభాలు!

ఏపీలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో విశాఖపట్నం ముందు వరుసలో ఉంది. వైజాగ్ లో పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే కనుక ఈ ఏరియాలో స్థలాల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఫ్యూచర్ లో రియల్ ఎస్టేట్ కూడా పుంజుకోనుంది.

ఏపీలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో విశాఖపట్నం ముందు వరుసలో ఉంది. వైజాగ్ లో పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే కనుక ఈ ఏరియాలో స్థలాల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఫ్యూచర్ లో రియల్ ఎస్టేట్ కూడా పుంజుకోనుంది.

వైజాగ్‍లో ఈ ఏరియాలో గజం స్థలం 10 వేలే.. ఇప్పుడు కొంటే భారీ లాభాలు!

హైదరాబాద్ లో చాలా మంది ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారే ఉన్నారు. కానీ హైదరాబాద్ సిటీలో స్థలం కొనాలంటే కొనలేని పరిస్థితి. పోనీ సిటీ అవుట్ కట్స్ లో కొందామంటే ల్యాండ్ సమస్యలు వస్తాయేమో అన్న భయం. అంత దూరంలో ఎవరు కొంటారులే అని కూడా అనుకునేవాళ్లు ఉంటారు. ఎప్పటికైనా ఆంధ్రా వెళ్లాల్సిన వాళ్ళమే కదా.. హైదరాబాద్ లా డెవలప్ అవ్వకుండా ఉండిపోవడం అయితే జరగదు కదా అని భావిస్తున్నట్లైతే కనుక ఇదే మంచి అవకాశం. ప్రస్తుతం వైజాగ్ లో కొన్ని ఏరియాల్లో ల్యాండ్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ లో అందని ద్రాక్షలా ఉన్న భూమిని ఇక్కడ మీరు తక్కువ రేటుకే సొంతం చేసుకోవచ్చు. ఇన్ఫ్రా స్ట్రక్చర్ పరంగా విశాఖపట్నం ఆల్రెడీ డెవలప్ అయ్యింది.

విశాఖలో ఉండేవారికి వ్యాపార, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి. చిన్న పరిశ్రమల నుంచి భారీ ఎత్తున పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఈ కారణంగా వైజాగ్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఆప్షన్ గా ఉంది. వైజాగ్ లో ఏ ఏరియాలో పెట్టుబడి పెట్టినా గానీ మంచి లాభాలు ఉంటాయి. ఇక వైజాగ్ కి అతి దగ్గరలో ఉన్న కొత్తవలసలో కూడా రానున్న కాలంలో ఇక్కడ రియల్ ఎస్టేట్ భారీగా పెరగనుంది. కాబట్టి ఇప్పుడు భూముల మీద ఇన్వెస్ట్ చేసిన వారికి కొన్ని రోజుల తర్వాత మంచి లాభాలు పొందే ఛాన్స్ ఉంటుంది. విశాఖపట్నం నుంచి 27 కి.మీ. దూరంలో ఉన్న కొత్తవలస గ్రామం రియల్ ఎస్టేట్ కి అనువుగా ఉంది. నిజానికి కొత్తవలస విజయనగరం జిల్లాలో ఉన్నప్పటికీ దగ్గరగా ఉండడంతో వైజాగ్ లో కలిసిపోయింది.

వైజాగ్ లో పాపులర్ ప్రాంతాల్లో కొత్తవలస ఒకటి. ఇక్కడ చదరపు అడుగు స్థలం సగటున రూ. 1100గా ఉంది. అంటే గజం రూ. 9900 పడుతుంది. 200 గజాల స్థలానికి రూ. 19,80,000 అవుతుంది.  వైజాగ్ కి 30 కి.మీ. లోపు దూరంలో ఉండడం ప్లస్ పాయింట్ అని చెప్పాలి. వైజాగ్ విమానాశ్రయం కూడా 21 కి.మీ. దూరంలో ఉంది. 2014లో కొత్తవలసలో చదరపు అడుగు స్థలం 400 రూపాయలు ఉండేది. ఇప్పుడది 1100 రూపాయలకు పెరిగింది. రియల్ ఎస్టేట్ ఊపందుకుంటే కనుక డిమాండ్ పెరిగి భూముల ధరలు పెరిగే అవకాశం ఉంది. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ కింద కాకుండా.. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టుబడి పెట్టినట్లయితే అతి తక్కువ సమయంలోనే హైదరాబాద్ లో ఉన్న భూముల ధరలను ఈ ఏరియాలో చూడవచ్చునని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి