iDreamPost
android-app
ios-app

వీడియో: అపార్ట్మెంట్‌లో ప్రియురాలితో భర్త.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..

  • Published Jul 18, 2024 | 9:05 PM Updated Updated Jul 18, 2024 | 9:05 PM

Wife Caught Husband Red Handed While He Is In With Another Woman In Apartment: ఇంట్లో ఇల్లాలు ఉండగా.. అపార్ట్మెంట్ లో ప్రియురాలిని పెట్టాడు. భార్యకు తెలియకుండా ప్రియురాలితో ఉంటూ వచ్చాడు. ఎట్టకేలకు భర్తను రెడ్ హ్యాండెడ్ గా అపార్ట్మెంట్ లో ప్రియురాలితో ఉండగా పట్టుకుని వారి భరతం పట్టారు భార్య, ఆమె కుటుంబ సభ్యులు.

Wife Caught Husband Red Handed While He Is In With Another Woman In Apartment: ఇంట్లో ఇల్లాలు ఉండగా.. అపార్ట్మెంట్ లో ప్రియురాలిని పెట్టాడు. భార్యకు తెలియకుండా ప్రియురాలితో ఉంటూ వచ్చాడు. ఎట్టకేలకు భర్తను రెడ్ హ్యాండెడ్ గా అపార్ట్మెంట్ లో ప్రియురాలితో ఉండగా పట్టుకుని వారి భరతం పట్టారు భార్య, ఆమె కుటుంబ సభ్యులు.

  • Published Jul 18, 2024 | 9:05 PMUpdated Jul 18, 2024 | 9:05 PM
వీడియో: అపార్ట్మెంట్‌లో ప్రియురాలితో భర్త.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..

ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువైపోయాయి. ఆ మధ్య మిస్ వైజాగ్ నక్షత్ర భర్త వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వార్త సంచలనం సృష్టించింది. తనకు విడాకులు ఇవ్వకుండా వేరే మహిళతో ఉంటున్నాడని ఆమె ఆరోపించి వార్తల్లో నిలిచింది. కాగా తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి వైజాగ్ లో చోటు చేసుకుంది. విశాఖపట్నంకు చెందిన వివేక్ అనే వ్యక్తి హరిత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెద్దల సమక్షంలోనే వీరి వివాహం జరిగింది. అయితే కొన్నాళ్ల క్రితం వైజాగ్ లోని ఒక స్పాలో పనిచేసే యువతితో వివేక్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో భార్యను నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు.

ఆ యువతికి విలువైన బహుమతులను కూడా ఇచ్చాడని ఆ వ్యక్తి భార్య, ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సీతమ్మధార అపార్ట్మెంట్ లో భర్త వివేక్ ప్రియురాలితో ఉండగా హరిత, ఆమె కుటుంబ సభ్యులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం వివేక్ కి దేహశుద్ధి చేశారు. తనకు న్యాయం చేయాలంటూ వివేక్ భార్య హరిత డిమాండ్ చేశారు. స్పాలో పరిచయమైనా యువతితో పార్కులు, బీచ్ లు, హోటల్స్ కి వెళ్తూ ఎంజాయ్ చేశాడని ఆరోపించారు. మూడేళ్ళ క్రితం వివేక్, హరితలకు వివాహం జరిగింది. అయితే పెళ్ళైన రెండు నెలల నుంచే భార్యకు దూరంగా ఉంటూ వచ్చాడని హరిత చెబుతున్నారు. ఒకే ఇంట్లో ఉన్నా గానీ వేరే గదిలో ఉండేవాడని ఆమె అన్నారు. పెళ్ళైన 3, 4 నెలల తర్వాత నుంచి స్పాకి వెళ్లేవాడని.. ఈ అమ్మాయితో చాటింగ్ లు చేసేవాడని అన్నారు. ఈ అమ్మాయితోనే కాకుండా చాలా మంది అమ్మాయిలతో చేసిన చాటింగ్స్ లో అసభ్యకర మెసేజులు ఉన్నాయని అన్నారు.

నిలదీసినందుకు తనను కొట్టాడని ఆమె అన్నారు. వివేక్ ఇంట్లో చెబితే వాళ్ళు కూడా అతన్ని వెనకేసుకొచ్చారని.. పెద్దల దగ్గర పంచాయితీ పెడితే భార్యతో కలిసి ఉంటానని చెప్పాడని హరిత అన్నారు. స్పాలో పని చేసే యువతిని ఇంటికి పంపించేసి మామూలు అయిపోయాడని.. అయితే మళ్ళీ ఆఫీస్ పక్కనే ఒక అపార్ట్మెంట్ తీసుకుని అందులో ఆ యువతిని పెట్టాడని ఆమె అన్నారు. ఆ యువతితో అపార్ట్మెంట్ లో ఉంటున్నాడని హరిత అన్నారు. గత ఏడాది మే 6న పోలీసులకు ఫిర్యాదు చేశామని.. మే 20న ఎఫ్ఐఆర్ నమోదు అయ్యిందని అన్నారు. ఆ తర్వాత వివేక్ కుటుంబ సభ్యులు విడాకులు కావాలని లాయర్ నోటీసులు పంపించారని అన్నారు. న్యాయం కోసం పోరాడుతున్నానని.. తనకు న్యాయం చేయాలని హరిత, ఆమె కుటుంబ సభ్యులు  డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş