nagidream
వైజాగ్ లో రియల్ ఎస్టేట్ కి అనువైన ఏరియాల్లో తక్కువ ధరకు స్థలాలు దొరికే ప్రాంతాలు ఏంటో చూడండి.
వైజాగ్ లో రియల్ ఎస్టేట్ కి అనువైన ఏరియాల్లో తక్కువ ధరకు స్థలాలు దొరికే ప్రాంతాలు ఏంటో చూడండి.
nagidream
వైజాగ్ లో కొన్ని ప్రధాన ఏరియాల్లో భూముల రేట్లు హైదరాబాద్ లో ఉన్న కూకట్ పల్లి, మియాపూర్ వంటి ఏరియాల్లో ఉన్న రేట్లే ఉన్నాయి. ఇదే వైజాగ్ లో తక్కువ ధరకు దొరికే ప్రాంతాలు కూడా ఉన్నాయి. వైజాగ్ లో ఇండ్ల స్థలాల ధరలు సగటున 38 లక్షలు పలుకుతుండగా.. మధ్యస్థ ధర 27 లక్షలుగా ఉంది. మొత్తంగా చూసుకుంటే వైజాగ్ లో 15 లక్షల నుంచి 60 లక్షల మధ్యలో స్థలాలు రేట్లు ఉన్నాయి. వైజాగ్ లో ప్రారంభ ధర చదరపు అడుగు 277 రూపాయలు ఉండగా.. సగటు ధర 5 వేలుగా ఉంది. అత్యధికంగా చదరపు అడుగు 40 వేలు పైన పలికే స్థలాలు కూడా ఉన్నాయి. ఇంతింత రేట్లు పెట్టి స్థలాలు కొన్నా ఫ్యూచర్ లో భారీ లాభాలు వస్తాయి. అయితే తక్కువ ధరకు భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి రెడీగా ఉన్న ప్రాంతాల్లో కొనుక్కుంటే మంచిది కదా. మరి తక్కువ ధరకు స్థలాలు దొరికే ప్రాంతాలపై ఓ లుక్కేయండి.
వైజాగ్ లో చెప్పుకోతగ్గ ఏరియాల్లో సీతమ్మధార ఒకటి. ఇక్కడ స్థలం కొనాలంటే 9 లక్షల నుంచి 2 కోట్ల వరకూ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సీతమ్మధారలో ప్రారంభ ధర చదరపు అడుగు 870 రూపాయలు ఉంటే.. యావరేజ్ ధర చదరపు అడుగు 6,800 వద్ద ఉంది. అత్యధిక ధర చదరపు అడుగుకి 9 వేలు పడుతుంది. ఈ సీతమ్మధారలో 150 గజాల స్థలం కొనాలంటే 12 లక్షలోపు అవుతుంది. అచ్యుతాపురం ఒకటి. ఇక్కడ చదరపు అడుగు రూ. 1350గా ఉంది. అంటే గజం స్థలం రూ. 12,150/-. 150 గజాల స్థలం కొనాలంటే 18,22,500/- అవుతుంది. తగరపువలసలో చదరపు అడుగు 1950/- పడుతుంది. గజం 17,550 అవుతుంది. 150 గజాల స్థలం కొనాలంటే 26 లక్షలు అవుతుంది. ఇక ఆ తర్వాత తక్కువ ధరకి దొరికే ఏరియా దువ్వాడ. ఇక్కడ చదరపు అడుగు 2 వేలు పలుకుతోంది. గజం 18 వేలు అంటే 150 గజాలకి 27 లక్షలు అవుతుంది. ఆనందపురంలో చదరపు అడుగు 2,200/- ఉంది. గజం 19,800 పడుతుంది. 150 గజాల స్థలానికి 30 లక్షలు అవుతుంది.
పెందుర్తిలో చదరపు అడుగు స్థలం 2,900 రూపాయల నుంచి మొదలవుతుంది. సగటు ధర 6,500 రూపాయలుగా ఉంది. ఇక్కడ స్థలం కొనాలంటే సగటున 47 లక్షలు పెట్టుబడి పెట్టాలి. మీడియం ధర అయితే 38 లక్షలు. అదే ప్రారంభ ధర అయితే 25 లక్షలు వరకూ అవుతుంది. ఇక్కడ నుంచి అన్నీ కాస్ట్లీ స్థలాలే. భీమిలిలో చదరపు అడుగు 3,100/- పడుతుంది. అంటే గజం 28 వేలు. 150 గజాల స్థలం కొనాలంటే 40 లక్షలు పైనే అవుతుంది. ఎంవీపీ కాలనీలో సగటు ధర చదరపు అడుగు 8 వేలు పలుకుతుంది. ఇక్కడ ల్యాండ్ ధర చదరపు అడుగుల్లో రూ. 6,500 నుంచి 11 వేల వరకూ ఉంది. అలానే మధురవాడలో చదరపు అడుగు 4,450 రూపాయల నుంచి 6,650 రూపాయలు మధ్య రేంజ్ లో ఉంది. మధురవాడలో 1000 చదరపు అడుగులు అంటే 110 గజాల స్థలం కొనాలంటే 50 లక్షలు అవుతుంది.
ఎండాడలో 1000 చదరపు అడుగుల స్థలం కొనాలంటే 65 లక్షలు అవుతుంది. ఇక్కడ 48 లక్షల నుంచి 2 కోట్ల మధ్యలో ఉన్నాయి స్థలాల రేట్లు. 33.33 శాతం స్థలాలు 60 లక్షల నుంచి 80 లక్షల రేంజ్ లో ఉంటే.. 22.22 శాతం స్థలాలు 80 లక్షలు నుంచి కోటి రూపాయల మధ్యలో ఉన్నాయి. ఎండాడలో 77.78 శాతం ఫ్లాట్స్, 11.11 శాతం విల్లాస్ ఉన్నాయి. సుజాత నగర్ లో చదరపు అడుగు సగటు ధర 7 వేలు పైనే ఉంది. ఇక్కడ స్థలం కొనాలంటే 42 లక్షలు అవుతుంది. సుజాత నగర్ లో అత్యధిక ధర 70 లక్షలుగా ఉంది. మహారాణిపేటలో చదరపు అడుగు యావరేజ్ గా 7,400 రూపాయలుగా ఉంది. పెద్ద వాల్తేర్ లో సగటున చదరపు అడుగు 8,200గా ఉంది. ప్రారంభ ధర అయితే 5,700గా ఉంది. పెద్ద వాల్తేర్ లో స్థలాల రేట్లు 11.50 లక్షల నుంచి కోటి 90 లక్షల రేంజ్ లో ఉన్నాయి. మధురవాడలో చదరపు అడుగు 4,850/- ఉంది. అంటే గజం 43 వేలు పైమాటే. 150 గజాల స్థలం కొనాలంటే 65 లక్షలు పైనే అవుతుంది. అయితే ఇప్పటి వరకూ చెప్పిన ప్రాంతాలన్నీ కూడా రియల్ ఎస్టేట్ కి అనువైన ఏరియాలే. కాబట్టి తక్కువ ధర నుంచి ఎక్కువ ధర వరకూ దొరికే ఈ ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో భారీ లాభాలను ఆశించవచ్చు.