iDreamPost
android-app
ios-app

Vizag: పోలీసులే షాక్! సంచలనాలు సృష్టిస్తున్న వైజాగ్ హనీ ట్రాప్ కేసు!

  • Published Oct 07, 2024 | 1:21 PM Updated Updated Oct 07, 2024 | 1:26 PM

Vizag: వైజాగ్ హనీ ట్రాప్ కేస్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసులో పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి.

Vizag: వైజాగ్ హనీ ట్రాప్ కేస్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసులో పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి.

  • Published Oct 07, 2024 | 1:21 PMUpdated Oct 07, 2024 | 1:26 PM
Vizag: పోలీసులే షాక్! సంచలనాలు సృష్టిస్తున్న వైజాగ్ హనీ ట్రాప్ కేసు!

ప్రపంచం ఇంత ముందుకు వెళుతున్నా కూడా మోసాలు మాత్రం ఆగట్లేదు. అందంతో ఎరవేసి వంచించేవాళ్లు, నమ్మించి గొంతుకోసే వాళ్ళు, బ్లాక్‌ మెయిల్‌ చేసేవాళ్ళు.. సైబర్ నేరస్తులు కుప్పలు కుప్పలుగా పెరిగిపోతున్నారు. అమాయకపు ప్రజలను నట్టేట ముంచుతున్నారు. వీరి దారుణాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అసలు ఎవరిని నమ్మోలో, ఎవరిని నమ్మకూడదో అన్న అర్ధం కానీ పరిస్థితిలో మనం బ్రతుకుతున్నాం. తాజాగా ఇంకో మోసం వెలుగులోకి వచ్చింది. విశాఖలో ఓ కిలాడీ లేడీ వ్యవహారం సంచలనం సృష్టిస్తుంది. తన అందాలను ఎరగా వేసి మగవాళ్ళని మత్తులోకి దించుతుంది. వాళ్ళు ఆ మత్తులో నుంచి తెరుకునేలోపే ముంచేస్తుంది. పైగా ఆమె మోసం చేసేది సాదా సీదా మగాళ్లని కాదు. బాగా చదుకున్నవాళ్ళు, విదేశాల్లో సెటిల్ అయ్యి బాగా సంపాదించిన వారినే టార్గెట్ చేస్తుంది. వారిని మోసం చేసేందుకు సోషల్ మీడియాని వాడుకుంటుంది. ఎన్నారైలకు వల వేస్తుంది. వారికి తన అందమైన ఫోటోలు పంపిస్తుంది. ప్రేమలో పడేసి పెళ్లి పేరుతో లైన్‌లో పెట్టేస్తుంది. వీడియో కాల్స్‌ చేసి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. చివరగా ఆమె మొహంలో పడ్డాక వాళ్ల దగ్గర నుంచి దొరికిన కాడికి దోచుకుంటుంది. ఫైనల్ గా వారిని నిండా ముంచేస్తుంది. తన అందాలతో అబ్బాయిలని గల్లంతు చేస్తున్న ఆ లేడి ఎవరు? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆ అమ్మాయి పేరు జాయ్ జెమీమా. ఆమె వైజాగ్ లోని మురళీనగర్ ఎన్జీవోస్ కాలనీలో ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌ లో ఓ ఎన్ఆర్ఐ యువకుడితో పరిచయం పెంచుకుంది. అతన్ని ప్రేమిస్తున్నట్టు మాయమాటలు చెప్పి అడ్డంగా ముంచేసింది. ఆమె మోసం నుంచి తెరుకున్న ఆ అబ్బాయి భీమిలి పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తెలిసాయి. వివరాల్లోకి వెళితే.. షీలానగర్ కి చెందిన ఓ ఫ్యామిలీ కొంతకాలంగా అమెరికాలో ఉంటోంది. ఇన్‌స్టా ద్వారా వారి కుమారుడితో జాయ్ జెమీమా పరిచయం పెంచుకుంది. అతని ద్వారా షీలానగర్ లోని వారి ఇంటి అడ్రెస్ తెలుసుకుంది. అతని తల్లిదండ్రులు షీలానగర్‌లో ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్ళేది. వారితో పరిచయం పెంచుకుంది. కొన్ని రోజుల పాటు మంచి అమ్మాయిగా నటించింది. మీ అబ్బాయి స్నేహితురాలినని వారితో బాగా కలిసిపోయింది. దాంతో ఇదే రైట్ టైమ్ అనుకుంది. ఒక శుభ దినాన వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని అడిగింది. కానీ అతని తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు. దాంతో ఆమె ఫస్ట్ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. అబ్బాయి, వాళ్ళ ఫ్యామిలీ తరువాత అమెరికా వెళ్లిపోయారు. మళ్ళీ సెకండ్ ప్లాన్ వేసింది జేమీమా. అమెరికాలో ఉంటున్న బాధిత యువకుడిని మాయ చేసి మళ్ళీ వైజాగ్ కి రప్పించింది. డైరెక్ట్ గా ఎయిర్‌పోర్ట్‌ కే వచ్చి అతన్ని మురళీనగర్ లోని తన ఇంటికి తీసుకు వెళ్ళింది. తీసుకెళ్ళి ఏం చేసిందో తెలుసా ? తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు.

అతనికి మత్తు పదార్థాలు కలిపిన డ్రింక్స్‌ ఇచ్చి మత్తులోకి దింపింది. అతనిపై పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తూ మైకంలో ఉన్నప్పుడు అతనికి దగ్గరయ్యి ఫొటోలను తీయించింది. వాటిని చూపించి ఆ యవకుడిని బెదిరించింది. పాపం ఆ బెదిరింపులకు భయపడి ఆ యువకుడు తనని పెళ్లి చేసుకుంటా అన్నాడు. తన తల్లిదండ్రులకు చెప్పిపెళ్లికి ఒప్పిస్తానని బ్రతిమాలాడు. అయినా కూడా జెమీమా తగ్గలేదు. తన సహచరులతో కలిసి ఇంకా రెచ్చిపోయేది. ఈ క్రమంలో ఇటీవల భీమిలిలోని ఒక హోటల్లో నిశ్చితార్థం చేసుకుని.. యువకుడితో రూ.5 లక్షల వరకు డబ్బుని ఖర్చు చేయించింది. అతని ఫోన్ బ్లాక్ చేసి, నిశ్చితార్థం, వారు దగ్గరైన ఫొటోలు చూపించి తన ఇంట్లో మళ్లీ నిర్బంధించింది. తనను పెళ్లి చేసుకోక పోతే ఈ ఫొటోలతో పోలీస్ కేసులు పెడతానన్నది.. అమెరికా వెళ్లకుండా చేస్తానని బెదిరించింది. అతని వద్ద ఉన్న డబ్బులన్నీ కాజేసింది. ఆమె ఇంటి నుంచి అతను తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఫ్రెండ్స్ తో కలిసి కత్తితో చంపడానికి కూడా ప్రయత్నించింది. ఆమె ఫ్రెండ్స్ కూడా జెమీమాను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తామని భయపెట్టేవాళ్ళు.

ఎట్టకేలకు ఈ నెల 4వ తేదీన బాధితుడు ఆమె నుంచి తప్పించుకున్నాడు. భీమిలి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు జెమీమాను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి ల్యాప్‌టాప్‌, ట్యాబ్, మూడు ఫోన్లు, కారు సీజ్ చేశారు. శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తీసుకెళ్లారు. గతంలో కూడా జెమీమా, ఆమె ఫ్రెండ్స్ ధనవంతుల అబ్బాయిలను టార్గెట్ చేసేవారు. వారిని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు గుంజేవాళ్ళని విచారణలో తెలిసింది. జెమీమా ఫ్రెండ్స్ పై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఈ నేపద్యంలో ఈ కేసుకి సంబంధించి కీలక విషయాలను విశాఖ పోలీసు కమీషనర్ తెలిపారు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి బాధితులు ఉన్నారన్నారు. దీని వెనుక ఓ ముఠానే ఉందని తెలిపారు. జమీమాకు ఆ ముఠానే శిక్షణ ఇచ్చిందని షాకింగ్ విషయాలు చెప్పారు. ఎలా ట్రాప్‌ చేయాలి? ఎవర్ని ట్రాప్ చేయ్యాలి? మత్తు ఎలా ఇవ్వాలి? వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ ఎలా చేయాలి? ఇవన్నీ కూడా ఆమెకు నేర్పించారట. అన్ని ఆధారాలను సేకరించి అందరినీ అరెస్ట్‌ చేస్తామని.. విశాఖ సీపీ బాగ్చి తెలిపారు. ఇదీ సంగతి. హనీ ట్రాప్ లో పడి ఓ యువకుడు ఇలా ఇబ్బందులు పడ్డాడు. మరి ఈ విషయం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş