iDreamPost
android-app
ios-app

ఆ రూమ్‌లో ఉన్న అమ్మాయి నా భార్య కాదు, లవరూ కాదు! తన బ్యాగ్రౌండ్ చెప్పిన మిస్ వైజాగ్ భర్త!

  • Published Jun 01, 2024 | 1:10 PM Updated Updated Jun 01, 2024 | 1:10 PM

Miss Vizag Nakshatra, Sai Teja, Vizag: తన భార్య నక్షత్రతో తనకున్న విభేదాలపై తాజాగా ఆమె భర్త సాయి తేజ స్పందించాడు. ఈ క్రమంలోనే తనతో పాటు రూమ్‌లో ఉన్న అమ్మాయి బ్యాగ్రౌండ్‌ గురించి కూడా వెల్లడించాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

Miss Vizag Nakshatra, Sai Teja, Vizag: తన భార్య నక్షత్రతో తనకున్న విభేదాలపై తాజాగా ఆమె భర్త సాయి తేజ స్పందించాడు. ఈ క్రమంలోనే తనతో పాటు రూమ్‌లో ఉన్న అమ్మాయి బ్యాగ్రౌండ్‌ గురించి కూడా వెల్లడించాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

  • Published Jun 01, 2024 | 1:10 PMUpdated Jun 01, 2024 | 1:10 PM
ఆ రూమ్‌లో ఉన్న అమ్మాయి నా భార్య కాదు, లవరూ కాదు! తన బ్యాగ్రౌండ్ చెప్పిన  మిస్ వైజాగ్ భర్త!

తన భర్త వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడని మిస్‌ వైజాగ్‌ నక్షత్ర.. తన భర్త, మరో అమ్మాయిపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వైజాగ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో నక్షత్ర భర్త సాయి తేజ, మరో అమ్మాయి ఉన్న సమయంలో నక్షత్ర, ఆమె తల్లి వెళ్లి గొడవకు దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో శుక్రవారం సోషల్‌ మీడియాలో ఒక రేంజ్‌లో వైరల్‌ అయ్యాయి. తెలుగు మీడియాలో మొత్తం సాయి-నక్షత్ర గురించే కథనాలు వెలువడ్డాయి. అయితే.. తాజాగా తన భార్య తన ఫ్లాట్‌కు వచ్చి గొడవకు దిగడంపై సాయి తేజ స్పందించాడు.

తనతో పాటు తన రూమ్‌లో ఉన్న అమ్మాయి.. తన భార్య కాదని, అలాగని లవర్‌ కూడా కాదని స్పష్టం చేశాడు సాయి తేజ. ఆ అమ్మాయి తన సినిమాకు లిరిక్‌ రైటర్‌గా పనిచేస్తోందని, గురువారం రాత్రి జర్నీ చేసి.. ఇక్కడి వచ్చిందని, ప్రయాణం చేసి అలసిపోవడంతో.. తన ఫ్లాట్‌లో రెస్ట్‌ తీసుకోమని తానే చెప్పానని అన్నాడు. తాను ఉదయం జిమ్‌ చేసి.. తన ఫ్లాట్‌కు వెళ్లాను.. అదే సమయంలో నక్షత్ర, ఆమె తల్లి, మరి కొంతమంది తన ఫ్లాట్‌లోకి చొచ్చుకొని వచ్చి.. గొడవ పెట్టుకున్నారని సాయి తేజ వెల్లడించాడు.

తన ఫ్లాట్‌లో తన పర్సనల్‌ వాష్‌రూమ్‌ కూడా ఉందని, నేను జిమ్‌కి వెళ్లి ఇంటికైనా వెళ్తాను, ఆఫీస్‌కైనా వెళ్తాను అది తన ఇష్టమని, ఆ అమ్మాయి, నేను అక్కడ ఉన్న సమయంలో వాళ్లు వచ్చేసి ఎలా గొడవ పెట్టుకుంటారని సాయి తేజ ప్రశ్నించారు. అయినా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఒకే రూమ్‌లో ఉన్నంత మాత్రనా వారి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు ఎలా అవుతుందని అన్నారు. తన ఫ్లాట్‌లో ఆ అమ్మాయి, నేను మాత్రమే కాకుండా.. ఇంకా ఆఫీస్‌ బాయ్స్‌ వాళ్లు కూడా ఉన్నారని సాయి తేజ చెప్పాడు. మరి ఈ ఘటనపై, ఆ అమ్మాయితో ఉన్న రిలేషన్‌పై సాయి తేజ ఇచ్చిన వివరణపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.