iDreamPost

సిటీలో ఈ ఏరియాలో గజం 12 వేలే.. ఫ్యూచర్‌లో గజం 50 వేలు అయ్యే ఛాన్స్!

ఒకప్పుడు హైదరాబాద్ లో ల్యాండ్ రేట్లు చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు కొనాలన్నా కొనలేని పరిస్థితి. అయితే అప్పుడు మిస్ అయ్యామని బాధపడేవారికి ఇప్పుడు ఈ ఏరియా ద్వారా మరో అవకాశం వచ్చింది. గజం 12 వేల చొప్పున కొనుక్కుని ఉంచుకుంటే ఫ్యూచర్ లో లక్షల్లో లాభాలు పొందవచ్చు.

ఒకప్పుడు హైదరాబాద్ లో ల్యాండ్ రేట్లు చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు కొనాలన్నా కొనలేని పరిస్థితి. అయితే అప్పుడు మిస్ అయ్యామని బాధపడేవారికి ఇప్పుడు ఈ ఏరియా ద్వారా మరో అవకాశం వచ్చింది. గజం 12 వేల చొప్పున కొనుక్కుని ఉంచుకుంటే ఫ్యూచర్ లో లక్షల్లో లాభాలు పొందవచ్చు.

సిటీలో ఈ ఏరియాలో గజం 12 వేలే.. ఫ్యూచర్‌లో గజం 50 వేలు అయ్యే ఛాన్స్!

తక్కువ రేటుకి స్థలం దొరుకుతున్నప్పుడు ఆ ఎవరు కొంటారులే అని లైట్ తీసుకుంటారు. తీరా ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ బూమ్ అందుకున్నాక ధరలు పెరిగిపోయాక అరెరె అనవసరంగా వదులుకున్నామే అని నాలుక కరుచుకున్నా ఉపయోగం ఉండదు. ఇప్పటికే హైటెక్ సిటీ, మాదాపూర్ వంటి ఏరియాల్లో ఒకప్పుడు పెట్టుబడి పెట్టలేదని ఇప్పటికీ ఫీలయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే తక్కువగా ఉన్నప్పుడే కొనుక్కుని పెట్టుకుంటే మంచిది. ఉండడానికైనా లేదా భారీ లాభాలకు అమ్ముకోవడానికైనా ఆ ల్యాండ్ అనేది ఉపయోగపడుతుంది. అసలు గజం 12 వేలకు సిటీలో దొరకడం అనేది అసాధ్యం. కానీ సామాన్యుడు కొనగలిగే తక్కువ బడ్జెట్ లో దొరుకుతుండడం విశేషం. 

ఎక్కడంటే?:

వైజాగ్ లోని అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం అనే ఏరియా ఉంది.ఇది అనకాపల్లి నుంచి 15 కి.మీ. దూరంలో ఉంది. విశాఖపట్నం నుంచి 30 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ కి పటాన్ చెరువు ఉన్నంత దూరంలో ఉంది ఈ అచ్యుతాపురం. ఇది పెరుగుతున్న ఇండస్ట్రియల్ కార్యకలాపాలకు, ఉపాధి కేంద్రాలకు ప్రసిద్ధి చెందింది. విశాఖపట్నం ఇప్పటికే పలు ఇండస్ట్రీలు, ఐటీ కంపెనీలకు మోస్ట్ ఫేవరెట్ లొకేషన్ గా ఉంది. ఈ కారణంగా సిటీ మొత్తం కొత్త వెంచర్స్ నిర్మించడానికి, అభివృద్ధి చేయడానికి అటు బయ్యర్స్ కైనా, ఇటు ఇన్వెస్టర్స్ కైనా మంచి స్కోప్ ఉంది. ఇలా మంచి స్కోప్ ఉన్న ఏరియాల్లో అచ్యుతాపురం కూడా ఉంది. ఇక్కడ 2 బీహెచ్కే ఫ్లాట్స్ నుంచి విల్లాల వరకూ అనేక కొత్త కొత్త నిర్మాణాలు జరుగుతున్నాయి.

ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి?:

  • విశాఖపట్నంలో వేగంగా డెవలప్ అవుతున్న ప్రాంతాల్లో అచ్యుతాపురంఒకటి. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్) అచ్యుతాపురంలోనే ఉంది. రాష్ట్రంలోనే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేసే రంగంగా ఉంది.        
  • ల్యాండ్ మీద ఇప్పుడు పెట్టిన పెట్టుబడులకు భవిష్యత్తులో అత్యధిక లాభాలు వస్తాయని.. పలు ఇతర అభివృద్ధి ప్రాజెక్ట్స్ ని ఈ ఏరియా ఆకర్షిస్తుందని నిపుణలు చెబుతున్నారు. 
  • వైజాగ్ లో బెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి. ఇవి అచ్యుతాపురంలో ఆర్థిక అవకాశాలను కల్పిస్తాయి. 
  • పార్కింగ్, నీరు, విద్యుత్ సరఫరా, వర్షపు నీటి నిల్వ, సోలార్ ఫెన్సింగ్ వంటి అనేక సౌకర్యాలతో ఇక్కడ ప్రాపర్టీలు అందుబాటులో ఉన్నాయి.  
  •  ఎన్టీపీసీ, స్టీల్ ప్లాంట్, బ్రాండిక్స్ అప్పరెల్స్ పార్క్ వంటివి అచ్యుతాపురంలో ఉన్నాయి. వీటి వల్ల లగ్జరీ హౌసెస్, అపార్ట్మెంట్స్ అనేవి వస్తాయి. ఈ కారణంగా షాపింగ్ మాల్స్, మర్కెట్స్, సకూల్స్, హాస్పిటల్స్ వంటివి వస్తాయి.
  • బార్క్, హెచ్పీసీఎల్ రిఫైనరీ, వేలంకణి గ్రూప్, కాన్ఫిడెన్స్ పెట్రోలియం, ఈస్టర్న్ నావల్ ఎస్టాబ్లిష్ మెంట్, పిల్కింగ్టన్, ఓషన్ ఇండియా, నాగార్జున ఆగ్రో కెమికల్ కంపెనీ సహా అనేక కంపెనీలు ఉన్నాయి.      
  • వైజాగ్ ఎయిర్ పోర్ట్ నుంచి 35 కి.మీ.., గాజువాక నుంచి 30 కి.మీ., అనకాపల్లి రైల్వేస్టేషన్ నుంచి 15 కి.మీ., దువ్వాడ రైల్వేస్టేషన్ నుంచి 27 కి.మీ., స్టీల్ ప్లాంట్ నుంచి 27 కి.మీ, ఎన్టీపీసీ నుంచి 15 కి.మీ., ఏపీ సెజ్ నుంచి 4 కి.మీ. దూరంలో అచ్యుతాపురం ఉంది.  

ధరలు ఎలా ఉన్నాయి?:

ఎలా చూసినా గానీ రియల్ ఎస్టేట్ గ్రోత్ కి ఉండాల్సిన అర్హతలు అన్నీ అచ్యుతాపురం ఏరియాకి ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో భారీ లాభాలను ఆశించవచ్చునని అంటున్నారు. 2014లో మధురవాడలో గజం 15 వేలు ఉండేది. ఇప్పుడు 45, 50 వేలు పలుకుతుంది. మధురవాడలో పెరిగినట్టే అచ్యుతాపురంలో కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అచ్యుతాపురంలో చదరపు అడుగు సగటున రూ. 1350గా ఉంది. అంటే గజం 12,150 రూపాయలు పలుకుతుంది. 150 గజాల స్థలం కొనాలంటే 18 లక్షల 22 వేలు అవుతుంది. ఇప్పుడు కొంటే గజం 30 వేలు అయినా గానీ 45 లక్షల ఆదాయం వస్తుంది. అంటే పెట్టుబడి కాకుండా 25 లక్షలు పైనే లాభం వస్తుంది. సామాన్య, మధ్యతరగతి వాళ్లకి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు.    

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి