iDreamPost
android-app
ios-app

విద్యార్థిని పరీక్ష ఆల్మోస్ట్ మిస్ అయ్యింది! అంతలో పోలీస్ దేవతలా వచ్చి!

విద్యార్థులకు ఇప్పుడు కఠిన సమయం. పరీక్షలతో, పాఠ్యపుస్తకాలతో కుస్తీలు పుడుతుంటారు. అదేవిధంగా పరీక్ష రాసేందుకు సెంటర్లకు పరుగులు తీయడం ఒక టాస్క్. అయితే..

విద్యార్థులకు ఇప్పుడు కఠిన సమయం. పరీక్షలతో, పాఠ్యపుస్తకాలతో కుస్తీలు పుడుతుంటారు. అదేవిధంగా పరీక్ష రాసేందుకు సెంటర్లకు పరుగులు తీయడం ఒక టాస్క్. అయితే..

విద్యార్థిని పరీక్ష ఆల్మోస్ట్ మిస్ అయ్యింది! అంతలో పోలీస్ దేవతలా వచ్చి!

ఇది విద్యార్థులకు పరీక్షా కాలం. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయాయి. పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 18న టెన్త్ ఎగ్జామ్స్ స్టార్ అయ్యాయి. మార్చి 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9. 30 గంటల నుండి మధ్యాహ్నం 12. 45 గంటల వరకు పరీక్ష ఉండనుంది. విద్యార్థులను ఉదయం 8.45 నుండి అనుమతి ఇస్తున్నారు. కాగా, తొలిసారి పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్నారు పదో తరగతి విద్యార్థులు. ఓ వైపు చదువు.. మార్కుల కోసం ఒత్తిడి వెరసి.. పరీక్షా కేంద్రాలకు చేరే విషయంలో కాస్త తడబడుతుంటారు. సకాలంలో చేరాలన్న కంగారులో ఒక పరీక్షా కేంద్రానికి బదులు మరొక కేంద్రానికి వెళ్లిపోతుంటారు. అక్కడి నుండి మరో చోటికి వెళ్లాలంటే సమయం ఉండదు. అప్పుడు పరీక్ష పోయినట్లే.

ఏపీలో ఒక్క నిమిషం నిబంధన తీసేసినప్పటికీ.. సకాలంలో చేరుకోవాలన్న ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇటువంటి దృశ్యాలు పరీక్షల సమయంలో కనిపిస్తూనే ఉంటాయి. ఒక ఎగ్జామినేషన్ సెంటర్ అనుకుని.. మరొక పరీక్షా కేంద్రానికి వచ్చి.. ఏం చేయాలో తోచక కంగారు పడటంతో పాటు నిస్సహాయ స్థితిలో నిలుచుండిపోతుంటారు. ఒక్కోసారి ఏడ్చేస్తుంటారు కూడా.  అలాంటి దృశ్యమే తాజాగా విశాఖ పట్నంలో చోటుచేసుకుంది. దేవరాపల్లి మండలం తెనుగుపూడి కేంద్రంలో పరీక్ష రాయాల్సిన ఓ విద్యార్థిని పొరబాటున మరో కేంద్రానికి వెళ్లిపోయింది.  అక్కడకు వెళ్లాక తనది ఆ సెంటర్ కాదని తెలుసుకున్నాక బిక్కమొహం వేసేసిందో స్టూడెంట్. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై నాగేంద్ర  గమనించి.. వెంటనే స్పందించారు.

పరీక్షకు సమయం దగ్గర పడుతుందని గుర్తించిన ఆయన .. వెంటనే అక్కడే విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్‌ చంద్రకళను ఆ విద్యార్థినిని తన పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలని పురమాయించారు. దీంతో ఆమె స్కూటీపై ఆ విద్యార్థిని తెనుగు పూడి కేంద్రానికి పంపారు. దేవరాపల్లి కేంద్రం నుండి ఆమెను తన పరీక్షా కేంద్రానికి సకాలంలో చేర్చింది  ఆ కానిస్టేబుల్.  ఆ సమయంలో పదో తరగతి విద్యార్థినికి ఆమె దేవతలా మారి.. పరీక్షా కేంద్రానికి చేర్చింది. లేకుంటే ఆల్మోస్ట్ మిస్ అయ్యేది ఆ విద్యార్థిని.  దీంతో విద్యార్థిని కానిస్టేబుల్‌కు ధాంక్స్ చెప్పి.. పరీక్షా కేంద్రంలోకి పరుగులు తీసింది. ఎస్సై నాగేంద్ర స్పందించి.. కానిస్టేబుల్ తో విద్యార్థినిని పంపించడంతో ఎగ్జామ్ రాయగలిగింది. ఈ విషయం తెలిసి చాలా మంది మహిళా కానిస్టేబుల్‌ను ప్రశంసిస్తున్నారు.