Vinay Kola
Crime: ఆమె టెక్కీ.. అతనో కేటరింగ్ ఓనర్.. ఇద్దరూ కలిసి లవ్ లో పడ్డారు..
Crime: ఆమె టెక్కీ.. అతనో కేటరింగ్ ఓనర్.. ఇద్దరూ కలిసి లవ్ లో పడ్డారు..
Vinay Kola
ఆమె సాఫ్ట్వేర్ ఇంజినీర్.. అతనో క్యాటరింగ్ ఓనర్.. ఇద్దరి మనసులు కలిశాయి. ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ళ నుంచి డేటింగ్ చేసుకుంటున్నారు. ఒకే రూమ్ లో ఉంటున్నారు. కానీ వన్ బ్యాడ్ డే.. ఏమైందో ఏమో తెలీదు కానీ.. దారుణం చేసుకున్నారు. ఆత్మ హత్యకి పాల్పడ్డారు. తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. ఇంతకీ ఏం జరిగింది? పూర్తి వివరాల్లోకి వెళితే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమలాపురానికి చెందిన పిల్లి దుర్గారావు, నూకల సాయి సుస్మిత ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇక దుర్గారావు స్థానికంగా ఫుడ్ బిజినెస్ చేస్తుండగా.. సుస్మిత మాత్రం హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తోంది..ఈ యువతీ, యువకులు.. కొన్నాళ్ల నుంచి వైజాగ్ లో ఓ అపార్ట్మెంట్ లో రూమ్ తీసుకొని సహజీవనం చేస్తున్నారు. మంగళవారం నాడు తెల్లవారుజామున ఏమైందో ఏమో కానీ అపార్ట్‌మెంట్ మూడో అంతస్తు పైనుంచి దూకి ఈ యువ జంట సూసైడ్ చేసుకుంది. దీంతో స్థానికులు పోలీసులుకు సమాచారం ఇచ్చారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి మృతదేహాలను పరిశీలించారు. వీరిద్దరూ రూమ్‌లో గొడవ పడటం, ఆ తర్వాత ఇద్దరూ బిల్డింగ్ పై నుంచి దూకారు. కారణాలు ఏమో కానీ వీరి ఆత్మహత్యకు ముందు రూమ్‌లో గొడవ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎందుకంటే రూమ్‌లో సిట్యుయేషన్ కూడా అలాగే ఉంది.
టీవీ రిమోట్, టీ కప్పులు, గాజు సామాగ్రి కూడా పగిలి ఉండటంతో.. చనిపోయే ముందు రాత్రి ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగి ఉండొచ్చని.. పోలీసులు బలంగా చెప్పారు. ఇక తరువాత వీరి మృతదేహాలను స్వాధీనం చేసుకొని, పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆ తరువాత వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తమ బిడ్డలు ఇంతటి అఘాయిత్యం చేసుకోవడంతో వారు బోరున విలపిస్తున్నారు. తీరని శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇంకా రక రకాల కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వీరు కావాలని ఆత్మహత్య చేసుకున్నారా..? లేక మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయని అనే దానిపై పోలీసులు విషయాలు ఆరా తీసుకున్నారు. ఈ ప్రేమ జంట ఆత్మహత్యపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఏది ఏమైనా ప్రస్తుతం వీరి ఆత్మహత్య మాత్రం స్థానికంగా సంచలనం రేపుతుంది. ఇక ఈ విషాద ఘటన గురించి మీరేమి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.