విశాఖ ఆర్కే బీచ్‌లో పెళ్లి రోజున మిస్సింగ్ కేసులో కనిపించకుండా పోయిన వివాహిత చిరిగిడి సాయి ప్రియ వ్యవహారంలో అనూహ్యమైన మలుపు తిరిగింది. సముద్రంలో గల్లంతు అయ్యిందని, ఆమె ఆచూకీ కోసం రెండు రోజులుగా హెలికాప్టర్ తో వెతుకుతున్నారు. తీరా చూస్తే ఆమె నెల్లూరులో ప్రత్యక్షమైంది. అక్కడ ఓ యువకుడితో ప్రియ ఉన్నట్లు పోలీసులు కనిపెట్టారు. అతను ఎవరు? ప్రియుడా? పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. రెండురోజుల క్రితం సాయిప్రియ పెళ్లి రోజున భర్తతో కలిసి విశాఖ ఆర్కే […]
తెలుగుదేశం పార్టీని కుదిపేసేలా మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో చిక్కుకుని విలవిలలాడుతున్న నేతలకు తోడు మరి కొందరికి కొత్త చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున భూ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయించాలని జగన్ ప్రభుత్వం ఇది వరకే నిర్ణయించింది. ఈ మేరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక […]
విశాఖపట్నంలో భూ బకాసురులపై ప్రభుత్వం కొరడా ఝులిపించింది. దాదాపు 200 కోట్ల విలువైన 100 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుంది. అడవివరం నుంచి శోత్యం వెళ్లే మార్గంలో రామ అగ్రహారం వద్ద 110 ఎకరాల చుట్టూ ప్రహరి గోడ కట్టి మొక్కలు పెంచుతున్నారు. ఇందులో పది ఎకరాలు ప్రైవేటు భూమి కాగా.. మిగతా 100 ఎకరాలు ప్రభుత్వ భూమి. అయితే టీడీపీ ప్రభుత్వ హాయంలో ఈ భూమిపై పెద్దల కన్ను పడింది. వెంటనే […]
తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న అతిపెద్ద భూ కుంభకోణాల్లో మొదటి స్థానంలో అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ కాగా. రెండో అతిపెద్ద స్కాం విశాఖలో జరిగిన భూ అక్రమాలు. ఈ రెండు కుంభకోణాలపై వైసీపీ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. అమరావతి భూ కుంభకోణంపై జరుగుతున్న విచారణపై హైకోర్టు స్టే ఇవ్వగా.. కోవిడ్ కారణంగా విశాఖ భూ కుంభకోణంపై ఆగిపోయిన సిట్ విచారణ తిరిగి ప్రారంభమైంది. ఈ రోజు ఆదివారం సిట్ చైర్మన్ విజయ్‌కుమార్, సభ్యులు అనూరాధ, భాస్కరరావులతో […]
..బా.. బావా.. బావా నిన్నే వినపడుతుందా.. అక్కడకెళ్ళాలంటే భయమేస్తోంది బా.. అంటూ అరుస్తున్నాడు మణిగాడు. వాడి పక్కనే భౌతిక దూరం పాటిస్తూ ఆదివారం పుస్తకం చదివే పనిలో బిజీగా ఉన్నాడు కిట్టయ్య. వినపడుతుందా బావా.. నేను గొంతు చించుకుంటుంటే ఏమీ పట్టనట్టు పుస్తకంలో మునిగిపోయావేంటీ.. అంటూ చిరాకుపడ్డాడు మణి. ఏంట్రాబాబూ మళ్ళీ ఏం పట్టుకొచ్చావ్.. అంటూ పుస్తకంలో నుంచి తలపైకెత్తాడు కిట్టయ్య. అదే బావా వైజాగ్ వెళ్ళాలంటే భయమేస్తోంది బావా అన్నాడు మణి. ఏంట్రోయ్ అదేమన్నా పాకిస్థానా, […]
కరోనా లాక్ డౌన్ వల్ల రెండు నెలలుగా తీవ్ర సంక్షోభంలో ఉన్న సినిమా పరిశ్రమకు పెద్ద ఊరట. జూన్ 1 నుంచి తమ రాష్ట్రంలో షూటింగులకు అనుమతి ఇస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా జిఓ కూడా విడుదల చేశారు. లొకేషన్స్ ని మూడు విభాగాలుగా డివైడ్ చేసి పది, పదిహేను, ఐదు వేల చొప్పున కాషన్ డిపాజిట్లు నిర్ణయించి నియమ నిబంధనలకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చని అందులో తెలిపింది. […]
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఎందుకంటే cలో ఆదివారం రెండు కొరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడటంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. కొరోనా వైరస్ సమస్య మొదలైనప్పటి నుండి ప్రభుత్వానికి విశాఖపట్నం జిల్లా పెద్ద ప్రాబ్లెమ్ గా తయారైంది. ప్రభుత్వం తాజా ప్రకటనతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6కి చేరుకోవటంతో యంత్రాంగంలో టెన్షన్ మొదలైంది. మొదటి నుండి విశాఖ జిల్లా యంత్రాంగాన్ని ఇబ్బంది పెడుతునే ఉంది. ఎలాగంటే విదేశాల నుండి […]
విశాఖపట్నం మాధవధారలో ఒక అపార్ట్మెంట్ లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో వ్యభిచారం నిర్వహిస్తున్న వారితో పాటు నలుగురు విటులను, ఒక మహిళను పోలీసులు పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి.ఈ దాడులలో ఇద్దరు నిర్వాహకులతో పాటుగా నలుగురు విటులను అరెస్ట్ చేసి 18 వేలను సీజ్ చేశారు. కాగా పట్టుబడిన విటులలో ఇద్దరు జబర్దస్త్ నటులు ఉండటం గమనార్హం. వారిని దొరబాబు, పరదేశిగా […]
“నీవు చెప్పేదానితో నేను ఏకీభవించకపోవచ్చు. కానీ ఆ విషయం చెప్పడానికి నీకున్న హక్కుని కాపాడడానికి నీతో కలిసి పోరాటం చేస్తాను” అని మూడు శతాబ్ధాల క్రితం ఫ్రెంచ్ తత్వవేత్త వోల్టోయిర్ చెప్పిన మాటలు ప్రజాస్వామ్యానికి మూలస్థంభంలా ఉన్నాయి. అయితే చాలాసార్లు వ్యవస్థ కన్నా నాయకుల వ్యక్తిగత భావనలే బలమైనప్పుడు భావ వ్యక్తీకరణకు కూడా అడ్డుకట్టలు పడుతుంటాయి. విశాఖపట్నంలో తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు పర్యటనను ప్రభుత్వం అడ్డుకోవడం గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ పర్యటనకు వచ్చిన […]
ఉగాదికల్లా పరిపాలనా రాజధాని ఇంకా ముఖ్య కార్యాలయాలను విశాఖపట్నం తరలించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అధికారగణం కదులుతోంది. విశాఖలోని పలు భవనాలను పరిశీలిస్తూ వాటిని ఎలా ఉపయోగించుకోవాలన్న దాన్ని అంచనావేస్తున్నారు. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ విశాఖ కలెక్టర్ తో పలుమార్లు చర్చించారు. గతంలో బీచ్ రోడ్‌లోని మిలినియం టవర్స్ లో సచివాలయం, సీఎం ఆఫీసు ఏర్పాటు చేయాలని భావించినా కొన్ని కారణాలవల్ల అది సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు […]