iDreamPost
android-app
ios-app

విశాఖ-ఢిల్లీ ఎయిరిండియాకు బాంబు బెదిరింపు! ఎయిర్ పోర్టు వర్గాలు అప్రమత్తం!

Air India Delhi-Visakhapatnam Flight: 107 మందితో ఢిల్లీ నుంచి విశాఖపట్నం బయలు దేరిన ఎయిరిండియా విమానంకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో ఎయిర్ పోర్టు సిబ్బంది వెంటనే అప్రమమత్తమై..విమానంలో తనిఖీలు చేశారు.

Air India Delhi-Visakhapatnam Flight: 107 మందితో ఢిల్లీ నుంచి విశాఖపట్నం బయలు దేరిన ఎయిరిండియా విమానంకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో ఎయిర్ పోర్టు సిబ్బంది వెంటనే అప్రమమత్తమై..విమానంలో తనిఖీలు చేశారు.

విశాఖ-ఢిల్లీ ఎయిరిండియాకు బాంబు బెదిరింపు! ఎయిర్ పోర్టు వర్గాలు అప్రమత్తం!

ఇటీవల కాలంలో విమానాల ప్రయాణాలు బాగా పెరిగాయి. ఒకప్పుడు ఫ్లైట్ జర్నీ అంటే.. ఏదో వింతగా, ప్రత్యేకంగా అనిపించేది. కానీ నేటికాలంలో విమానా జర్నీ చాలా కామన్ అయ్యింది. ఇక ప్రయాణికులకు వివిధ ఎయిర్ లైన్స్ సంస్థ అనేక సదుపాయాలను అందిస్తుంటాయి. ఇదిఇలా ఉంటే.. ప్రపంచంలో ఏదో ఒక మూలన విమానాలకు, ఎయిర్ పోర్టులపై బాంబు దాడి జరిగిన ఘటనలు తరచూ చోటుచేసుకుంటాయి. అంతేకాక మరికొన్ని సందర్భాల్లో బాంబు బెదిరింపులు కూడా వస్తుంటాయి. తాజాగా ఢిల్లీ నుంచి విశాఖ పట్నం వెళ్తున్న ఎయిరిండియా విమానంకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. చివరకు అసలు విషయం తెలుసుకుని షాకయ్యారు. ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే..

మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీ నుంచి విశాఖపట్నంకు ఎయిరిండయా విమానం బయలుదేరింది. ఈ క్రమంలోనే విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చింది. అయితే అప్పటికే విమానం బయలు దేరి.. 8.15కి విశాఖ పట్నం చేరుకుంది. ఇదే సమయంలో దిల్లీ ఏఐ సెక్యూరిటీ అప్రమత్తం చేయడంతో ఇక్కడ సీఐఎస్‌ఎఫ్, బాంబు స్క్వాడ్స్‌లు తనిఖీలు చేసింది. ఈ చెకింగ్స్ లో బాంబు వంటివి ఏమీ లేదని నిర్ధారణకు వచ్చాయి. ఆ  విమానంలో 107 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే అనుమానాస్పద బాంబు బెదిరింపులకు పాల్పడి, తప్పుడు సందేశం ఇచ్చిన ప్రయాణికుడిని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాక అతడు అలా చెప్పడానికి గల కారణాలను తెలుసుకున్నారు.

సదరు వ్యక్తి చెప్పిన మాటలకు అందరూ షాకయ్యారు. విమానాశ్రయానికి నిర్ణీత సమయంలో చేరుకోలేకపోయిన ఆ  ప్రయాణికుడు ఫ్లైట్ ను కాసేపు ఆపాలని భావించాడు. ఈ క్రమంలోనే ఆ విమానంలో బాంబు పెట్టానంటూ ఎయిర్ పోర్టు వాళ్లకు కాల్స్ చేశాడు. అయితే అప్పటికే ఆ విమానం ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయ్యింది. దీంతో సదరు ప్రయాణికులు తాను అందుకోవాల్సిన ఫ్లైట్ ను మిస్సయ్యాడు.  అయితే బాంబు బెదిరింపు ఘటన మంగళవారం ఎయిర్ పోర్టులో కలకలం రేపింది.

బెదింపు కాల్ పై ఎయిర్ పోర్టు అధికారులు, సిబ్బంది అప్రమత్తమై..బాంబు గురించి తనిఖీలు చేపట్టారు. చివరకు అలాంటిదేమి లేదని గుర్తించారు. ఇలా ఫ్లైట్ లకు, మాల్స్ కు, సినిమా థియేటర్లకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తునే ఉంటాయి. వీటిల్లో చాలా వరకు ఫేక్ కాల్స్ ఉంటున్నాయి. కొందరు ఆకతాయిలు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. అంతేకాక పోలీసులకు చిక్కి కటకటాల పాలవుతున్నారు. మరి..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనంటే ఏమి చేయాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.