iDreamPost
android-app
ios-app

Lenin: అఖిల్ లెనిన్ సేఫ్ గేమ్

  • Published Jul 14, 2026 | 11:04 AM Updated Updated Jul 14, 2026 | 11:04 AM

ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాల్సిందే అని డిసైడ్ అయి బరిలోకి దిగారు తండ్రీ కొడుకులు నాగార్జున..అఖిల్ అక్కినేని.

ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాల్సిందే అని డిసైడ్ అయి బరిలోకి దిగారు తండ్రీ కొడుకులు నాగార్జున..అఖిల్ అక్కినేని.

Lenin: అఖిల్ లెనిన్ సేఫ్ గేమ్

ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాల్సిందే అని డిసైడ్ అయి బరిలోకి దిగారు తండ్రీ కొడుకులు నాగార్జున..అఖిల్ అక్కినేని. అందుకే తొలిసారి అన్నపూర్ణ సంస్థకు మరో సంస్థ ను తోడు తీసుకున్నారు. సినిమా నిర్మాణం అంతా తాము చూసుకుంటాము..మార్కెటింగ్ మీరు చూడండి అంటూ సితార నాగవంశీతో జతకట్టారు. అక్కడ ఒక అడుగు పడింది. సినిమా మేకింగ్ లో రాజీ పడకుండా యాభై కోట్లకు పైగా ఖర్చుచేసారు. అఖిల్ మీద ఎంత మేరకు వర్కవుట్ అవుతుంది అని లెక్కలు వేసుకోలేదు. అక్కడ రెండో అడుగు పడింది

థియేటర్ మీద దాదాపు ముఫై కోట్లకు పైగా బర్డెన్ కనిపించింది. అయినా ఎక్కువ రేట్లకు అమ్మలేదు. ఆ సినిమా రేంజ్ కు చాలా నార్మల్ రేట్లకు ఇచ్చారు. ఆంధ్ర 8 కోట్లకు ఇచ్చారు. అందులోనూ ఒక ఏరియా స్వంతంగానే పంపిణీ చేసుకున్నారు. సీడెడ్ రెండున్నర కోట్లకు ఇచ్చారు. రాయలసీమ నేపథ్యపు సినిమా కనుక అక్కడ కాస్త రేటు తెచ్చుకున్నారు. తెలంగాణలో స్వంతంగా పంపిణీ చేసుకున్నారు. ఆ విధంగా ఇంకో అడుగు వేసారు. థియేటర్ మీద కాస్త ఎక్కువ భారం వున్నపుడు టికెట్ రేట్లు పెంచడం అన్నది కామన్. అఫీషియల్ గా రేట్లు తీసుకురాలేదు. ఆంధ్రలోని అతి తక్కువ శాతం థియేటర్లలో మాత్రం వాటి యజమానులు ఓ యాభై పెంచి అమ్ముకున్నారు.

ప్రీమియర్లు వేయడం అన్నది ఫ్యాషన్ అయిపోయింది ఇటీవల. కానీ అలాంటి దానికి దూరంగా వుండిపోయారు. దీని మీద చాలా కిందా మీదా డిస్కషన్లు జరిగాయి. కానీ ప్రీమియర్లు వద్దు అనే బలమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఏమయింది. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా, దాదాపు బయ్యర్లు అంతా సేఫ్ జోన్ కు చేరిపోయారు. సోమవారం కలెక్షన్లు ఫరవాలేదు అనేలా వున్నాయి. వీక్ డేస్ అలా అలా వెళ్తే బ్రేక్ ఈవెన్ అయిపోతారు. మళ్లీ వీకెండ్ బాగుంటుంది. దాంతో ప్రతి చోటా ఓవర్ ఫ్లోస్ రావడానికి చాన్స్ వుంది.

ఓటిటి డీల్ లో బాగా ఆడితే మరింత అనే క్లాజ్ వుందని తెలుస్తోంది.దాని వల్ల మరికొంత రికవరీ అవుతుంది. మొత్తం మీద నాగ్ కు పెట్టిన పెట్టుబడి చాలా వరకు వెనక్కు వస్తుంది. మహా అయితే ఓ అయిదు కోట్లు చేతికి తగిలినా కొడుక్కు మంచి హిట్ ఇచ్చి, నిలబెట్టా అనే సంతృప్తి ముందు అది నథింగ్. ఈ ఊపులో రెండు మూడు సరైన ప్రాజెక్ట్ లు చేతిలోకి వస్తే అంతా సెట్ అయిపోతుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş