Chiranjeevi
ఓ మిడ్ రేంజ్ సినిమా OTT హక్కులు రూ.11 కోట్లకు విక్రయించగా.. మొత్తం బిజినెస్ రూ.27 కోట్లంటూ ప్రచారం జరుగుతోందా? టాలీవుడ్‌లో ప్రచారంలోకి వచ్చే లెక్కలపై ఆసక్తికర కథనం.
ఓ మిడ్ రేంజ్ సినిమా OTT హక్కులు రూ.11 కోట్లకు విక్రయించగా.. మొత్తం బిజినెస్ రూ.27 కోట్లంటూ ప్రచారం జరుగుతోందా? టాలీవుడ్‌లో ప్రచారంలోకి వచ్చే లెక్కలపై ఆసక్తికర కథనం.
Chiranjeevi
టాలీవుడ్ లో ఎలా వుంటుంది అంటే ఇదిగో తోక అంటే అదిగో పులి అనే మాదిరిగా. హీరోల కోసం లేని లెక్కలు, లేని ప్రచారాలు అలా అలా సాగిపోతుంటాయి. అర్ధరూపాయికి అమ్మితే రూపాయి అంటూ ప్రచారం జరిగిపోతుంది. పది మంది కలిసి ఏది అంటే అదే చలామణీలోకి వెళ్లిపోతుందన్న సూత్రం ఆధారంగానే ఇప్పుడు సినిమా పబ్లిసిటీ అంతా జరిగిపోతోంది.
ఓ మిడ్ రేంజ్ సినిమా రాబోతోంది. దాని ఓటిటి హక్కులు పదకొండు కోట్లకు విక్రయించారు. మహా మహా సినిమాలకే శాటిలైట్ రేటు రావడం లేదు. ఇంక ఈ సినిమాకి ఎంత వస్తుంది. మహా అయితే రెండు కోట్లు. హిందీ డబ్బింగ్ ఎప్పుడో పడిపోయింది. అదో అయిదు కోట్లు వేసుకోండి. అడియో రైట్లు ఓ మూడు కోట్లు వేసేసుకుందాం. ఎంతయింది. 21 కోట్లు. అంటే కాస్త ఉదారంగా లెక్కేసుకుంటే 21 కోట్లు.
కానీ ప్రచారంలోకి తెచ్చిన నెంబర్ దానికి మరింత కలిపి 27 కోట్లు. అసలు ఆ హీరో రేంజ్ ఎంత? లైనప్ ఎలా వుంది. అసలు హిట్ వచ్చి ఎన్నాళ్లు అయింది. కాంబినేషన్ ఏమిటి? నిజంగానే అంత వచ్చి వుంటుందా? ఇవేమీ లెక్కలు చూడకుండానే..విషయం ఎవరినీ అడిగి క్లారిటీ తీసుకోకుండానే పులి..పులి అంటూ ప్రచారం జరిగిపోతుంది.
కానీ కొసమెరుపు ఏమిటంటే సినిమా ఇండస్ట్రీ జనాలు అంతా మాత్రం ఈ ప్రచారం చూసి నవ్వుకుంటూ వుంటారు. ఎందుకంటే వారికి నిజాలు తెలుసు కనుక. కానీ ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్ మాత్రం అంత వచ్చిందట, ఇంత వచ్చిందట అని చెప్పుకోవడం వరకు పనికి వస్తుందీ ప్రచారం. సినిమా ఓపెనింగ్ చెబుతుంది అసలు సిసలు బజ్ ఏమిటన్నది.