Chiranjeevi
వారం వారం సినిమాలు వస్తూనే వుంటాయి. నైజాంలో ఇటు మైత్రీ అటు ఎస్వీసీ సంస్థలు పోటీ పడుతూనే వుంటాయి.
వారం వారం సినిమాలు వస్తూనే వుంటాయి. నైజాంలో ఇటు మైత్రీ అటు ఎస్వీసీ సంస్థలు పోటీ పడుతూనే వుంటాయి.
Chiranjeevi
వారం వారం సినిమాలు వస్తూనే వుంటాయి. నైజాంలో ఇటు మైత్రీ అటు ఎస్వీసీ సంస్థలు పోటీ పడుతూనే వుంటాయి. థియేటర్లు ఎక్కువగా ఎస్వీసీ కి అందుబాటులో వుంటాయి. ఎందుకంటే అటు ఆసియన్ తో కొలాబరేషన్ వుంది కనుక. మైత్రీకి ఇదే పెద్ద సమస్య. అప్పటికీ ఇటీవల వాళ్లు కూడా థియేటర్లు అక్వైర్ చేసుకుంటూ వస్తున్నారు. అక్కడితో ఆగకుండా వేరే వాళ్ల సినిమాలకు ఫండింగ్ ఇవ్వడం ప్రారంభించాయి. ఆ విధంగా నైజాంలో సినిమా పంపిణీ హక్కులు సంపాదించే పని పెట్టుకున్నాయి. అంటే నైజాంలో ఆసియన్ సునీల్, దిల్ రాజు, సురేష్ బాబు ఏయే వ్యాపార ఎత్తుగడలు అయితే అవలంబించి, తమ కంట్రోలు పెంచుకున్నారో, మైత్రీ సంస్థ ఇప్పుడు అదే దిశగా వెళ్తోంది. దీంతో ఈ రెండింటి నడుమ పోటీ పెరిగిపోతోంది.
పారడైజ్ సినిమా నైజాం హక్కులు మైత్రీ సంస్థ ఇటీవల దక్కించుకుంది. నిజానికి ఈ సినిమా తమ చేతుల్లోకి వస్తుందని ఆసియన్ సునీల్ అండ్ మిత్ర బృందం అనుకున్నారు. కానీ అలా కాలేదు. దీంతో దీనికి కారణం ఓ యువ నిర్మాత అని వాళ్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ యువ నిర్మాత మిత్రులకు తూర్పు గోదావరిలో పంపిణీ వ్యాపారాలు వున్నాయి. అందువల్ల ఈస్ట్ గోదావరిలో ఆసియన్ సునీల్ అండ్ కో పంపిణీ వ్యాపారాలు ప్రారంభించబోతున్నారు. అంటే నైజాం పోటీ కాస్తా ఇప్పుడు ఆంధ్రలోకి కూడా ఎంటర్ అవుతోంది అన్నమాట.
ఆంధ్రలోని వైజాగ్ లో దిల్ రాజు/శిరీష్ కు గట్టి సంస్థ వుంది. అలాగే ఈస్ట్, నెల్లూరు ల్లో కూడా తయారు చేయాలని ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
నిజానికి ఇది శుభపరిణామమే. ఎందుకంటే బయ్యర్లు పోటీ పడితేనే నిర్మాతలు బాగుపడతారు. వాళ్ల సినిమాలకు మంచి రేట్లు వస్తాయి. కానీ పోటా పోటీగా సినిమాలు వేస్తే మాత్రం సమస్య అవుతుంది. చూడాలి ముందు ముందు ఈ పోటీ ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో.