iDreamPost
android-app
ios-app

ఇంత దుర్మార్గమా.. భార్యకు పురుగుల మందు తాగించి.. చేతిని అడ్డుపెట్టి

  • Published Jun 29, 2024 | 11:34 AM Updated Updated Jun 29, 2024 | 11:34 AM

Visakhapatnam..ఆడ పిల్లలకు చదువుకు ఖర్చు పెట్టే డబ్బుల కన్నా.. పెళ్లికి ఎక్కువ వ్యయం చేస్తుంటారు తల్లిదండ్రులు. కట్నాలు, కానుకలు అంటూ తాహత్తుకు మించి పెళ్లి చేస్తారు. అత్తారింట్లో కూతురు సుఖపడిపోవాలని అనుకుంటారు.. కానీ అక్కడకు వెళ్లాక..

Visakhapatnam..ఆడ పిల్లలకు చదువుకు ఖర్చు పెట్టే డబ్బుల కన్నా.. పెళ్లికి ఎక్కువ వ్యయం చేస్తుంటారు తల్లిదండ్రులు. కట్నాలు, కానుకలు అంటూ తాహత్తుకు మించి పెళ్లి చేస్తారు. అత్తారింట్లో కూతురు సుఖపడిపోవాలని అనుకుంటారు.. కానీ అక్కడకు వెళ్లాక..

  • Published Jun 29, 2024 | 11:34 AMUpdated Jun 29, 2024 | 11:34 AM
ఇంత దుర్మార్గమా.. భార్యకు పురుగుల మందు తాగించి.. చేతిని అడ్డుపెట్టి

ఆడ పిల్ల అంటే అబల కాదు సబల అని చెప్పుకోవడానికే కానీ.. తుదకు ఆమె ఏదో ఒక విషయంలో బలైపోతూనే ఉంది. కన్నతల్లిదండ్రులు అపురూపంగా పెంచి.. ఓ అయ్య చేతిలో పెట్టేంత వరకు కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. కానీ ఊహించని పరిణామాల వల్ల కొంత మంది అమ్మాయిలు బలౌపోతున్నారు. దీంతో పెరేంట్స్ హడావుడిగా ఓ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎలాంటి వాడు అని తెలియకుండా.. సరైన బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా కూతురికి ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపుతారు. అక్కడకు వెళ్లాక సుఖంగా, సంతోషంగా ఉంటుందనకుంటారు. కానీ పరిస్థితులు దారుణంగా ఉంటాయి. డబ్బుపై మోజుతో మానవ రూపంలో ఉన్న మృగాలు ఆమెను మానసికంగా, శారీరకంగా హింసకు గురి చేస్తుంటారు.

వరకట్న వేధింపులకు ఎంతో మంది మహిళలు చనిపోయారు. ఎప్పటి నుండో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నా.. సరైన కట్టడి చర్యలు లేవనేది కొంత మంది వాదన. తాజాగా విశాఖ నగరంలో ఓ వివాహిత ఈ రక్కసికి బలైపోయింది. అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త, అత్త, మామ హింసిచారు. ఆమె కాదని చెప్పడంతో పురుగుల మందు తాగించి చంపేందుకు యత్నించారు. చనిపోతే ఆత్మహత్య చేసుకుందని బంధువులు, బయట జనాలకు నమ్మించాలని మాస్టర్ ప్లాన్ వేశారు. కానీ వారి ప్లాన్ బెడిసి కొట్టింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మహిళ తన మామయ్యకి ఆడియో కాల్ పంపడంతో అసలు విషయం వెలుగు చూసింది. చివరకు మహిళ చనిపోయింది. అత్తారింటి పాచికలకు అడ్డుకట్ట పడినట్లయ్యింది.

విశాఖలోని గాజువాకలో నివసిస్తున్నారు భార్యా భర్తలు పద్మిని, సోమేశ్వరరావు. తొలుత భర్త బాగానే ఉన్నా.. ఆ తర్వాత అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించడం మొదలు పెట్టాడు. వీరికి తోడయ్యారు అత్తామమలు. తీసుకురాలేనని పద్మిని చెప్పడంతో చంపేయాలనుకున్నారు. ఈ నెల ఒకటో తేదీన ఆమెను బంధించి.. నోట్లో పురుగుల మందు పోశాడు మామ. భర్త ఆ మందు కక్కకుండా నోటికీ చేతిని అడ్డుపెట్టుపెట్టాడు. బలవంతంగా పురుగులు మందు తాగించారు. దీంతో ఆమెకు వాంతులయ్యాయి. ఇరుగు పొరుగు చూసి ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో ఏం తెలియనట్లుగా కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు భర్త, అతడి ఫ్యామిలీ. అయితే ఈ జరిగినదంతా ఆడియో రికార్డు చేసి బంధువులకు పంపింది. చివరకు ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ఆడియో రికార్డు విన్న బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో భర్త సోమేశ్వరరావు, బాధితురాలి అత్తామామల్ని గాజువాక పోలీసులు అరెస్టు చేశారు.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetGrandpashabetMeritkingCasibomCasibomcasibomjojobet girişjojobetinterbahisjojobetMadridbetMadridbetJojobet girişgrandpashabetJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişgrandpashabetholiganbetgrandpashabet güncel girişjojobetjojobet girişgrandpashabet